కూటమి సర్కార్‌ సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేసినట్లు సమాచారం. 99 మందితో తొలి నామినేటెడ్ పదవుల జాబితాను మంగళవారం వెల్లడించింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లకు పదవులు కేటాయించడం జరిగింది. ఒక క్లస్టర్ ఇంఛార్జ్ ని చైర్మన్ పదవిలో నియమించారు. అలాగే ఆరుగురు యూనిట్ ఇంఛార్జ్ లకు పదవులు కేటాయించారు. 20 కార్పోరేషన్లకు చైర్మన్లు, ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్ తో పాటు వివిధ కార్పొరేషన్లకు సభ్యులను కూడా కూటమి ప్రభుత్వం వెల్లడించింది.


వెల్లడించిన నామినేటెడ్ పోస్టులు 99 శాతం పదవులు యువతకే ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ పదవులను కేటాయించారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయిన వారికి అలాగే పొత్తుల్లో భాగంగా టికెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ క్రమంలో టీడీపీ-16, జనసేన-3, బీజేపీ-1 చొప్పున మొత్తం 24 పోస్టులను భర్తీ చేశారు.


వక్ఫ్ బోర్డు చైర్మన్‌ గా అబ్దుల్ అజీజ్ నియామకం అయ్యారు. శాప్ కు అనిమిని రవి నాయుడు, హౌసింగ్ బోర్డు చైర్మన్‌ గా బత్తుల తాతయ్య బాబు ఫైనల్‌ అయ్యారు. అటు ట్రైకార్ చైర్మన్‌ గా బురగం శ్రీనివాసులు... ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ గా దామచర్ల సత్య నియామకం కావడం జరిగింది. సీడ్ యాప్ చైర్మన్‌ గా దీపక్ రెడ్డి అయ్యారు. 20 సూత్రాల అమలు చైర్మన్‌ గా లంకా దినకర్ (బీజేపీ) నియామకం అయ్యారు.


ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్‌ గా కర్రోతు బంగార్రాజు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ గా మన్నె సుబ్బారెడ్డి , ఏపీఐఐసీ చైర్మన్‌ గా మంతెన రామరాజు ఫైనల్‌ అయ్యారు.  పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌ గా నందం అబద్దయ్య నియామకం అయ్యారు.  ఏపీ టీడీసీ చైర్మన్‌ గా నూకసాని బాలాజీ, ఏపీఎస్సార్టీసీ ఛైర్మన్ చైర్మన్‌ గా కొనకళ్ల నారాయణ నియామకం అయ్యారు.  ఏపీఎస్సార్టీసీ వైస్ ఛైర్మన్ చైర్మన్‌ గా పీఎస్ మునిరత్నం, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ చైర్మన్‌ గా పీలా గోవింద్ నియామకం అయ్యారు.


లిడ్ క్యాప్ చైర్మన్‌ గా పిల్లి మాణిక్యాల రావు...ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్‌ గా పీతల సుజాత ఫైనల్ అయ్యారు. ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌ గా తమ్మిరెడ్డి శివ శంకర్ (జనసేన), పౌరసరఫరాల కార్పోరేషన్ చైర్మన్‌ గా తోట మెహర్ సీతారామ్ సుధీర్. (జనసేన) నియామకం అయ్యారు. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ చైర్మన్‌ గా వజ్జా బాబురావు,  ఏపీ టిడ్కో - వెనుములపాటి అజేయ్ కుమార్ (జనసేన) చైర్మన్‌ గా ఫైనల్‌ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: