* ప్రాంతీయ పార్టీల మనుగడే కష్టం
* జాతీయ పార్టీల చేతిలోకి అన్ని అధికారాలు
* ప్రభుత్వాలు కూలితే రాష్ట్రపతి పాలనే
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఉన్నపలంగా జెమిలి ఎన్నికలు నిర్వహిస్తే... పరిస్థితి ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు. వాస్తవంగా మొన్నటి వరకు ఈ ఎన్నికల గురించి.. మోడీ ప్రభుత్వం సైలెంట్ గా ఉంది. కానీ మొనాటి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి మెజారిటీ రాకపోవడంతో.. ఇప్పుడు జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకువచ్చింది.
అప్పుడు మరో 5 ఏళ్ల పాటు ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగవు అన్నమాట. కానీ జెమిలి ఎన్నికల రూల్స్ ప్రకారం.. మూడేళ్లలో మళ్లీ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినట్లుగానే... ఆ రాష్ట్రంలో కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. అంటే మూడేళ్ల మాత్రమే ఆ మధ్యంతర ప్రభుత్వం ఉంటుంది. దీంతో కోట్ల రూపాయల లో నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ఆ మూడు సంవత్సరాల పాటు రాష్ట్రపతి పాలన విధించే ఛాన్స్ ఉంటుంది అంటూ కొంతమంది చెబుతున్నారు.
రాష్ట్రపతి పాలన పెడితే ఆ రాష్ట్ర ప్రజలు కచ్చితంగా నరకం అనుభవిస్తారు. అభివృద్ధి జీరో కు పడిపోతుంది. సుస్థిర ప్రభుత్వం లేకపోవడంతో... సంక్షేమ పథకాలు కూడా అమలు కావు. రాష్ట్రపతి పాలన అంటేనే... జనాలు భయపడి పోతారు. అలాంటిది మూడేళ్లు రాష్ట్రపతి పాలన ఉండటం.. అత్యంత దారుణమని కూడా కొంతమంది చెబుతున్నారు. కాబట్టి జమిలి ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని కొంతమంది వాదన.