జనసేన పార్టీ అధినేత 2024 ఎన్నికలలో కూటమిలో భాగంగా తన పార్టీ నుంచి నిలబెట్టిన ప్రత్యర్థి ప్రతిచోట కూడా గెలిచారు. పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రి పదవి కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. అయితే వంద రోజుల పాలన ముగిసిన సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసేటువంటి లడ్డు కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఏపీ అంతా ఉలిక్కిపడింది. ఈ విషయం ఒక కారు చిచ్చుగా మారింది దేశమంతటా కూడా వ్యాపించడంతో ఏపీనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.



అయితే ఈ విషయం పైన వచ్చిన ఆరోపణల పైన కూడా విచారణ జరిపించాల్సింది పోయి.. కేవలం ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు. ఈ విషయం పైన కూడా ఎటువంటి దర్యాప్తు చేపట్టకుండా ఇంకా డెబిట్లు కొనసాగిస్తూనే ఉన్నారు.  పవన్ కళ్యాణ్ కూడా పాలనాపరంగా అడుగులు వేయాల్సింది కనుక ప్రాయశ్చిత్త దీక్షను మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్. అయితే అన్ని దేవాలయాల వద్దకు వెళ్లి అక్కడ శుభ్రపరచే కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాల మీద కొన్ని చర్చలు కొనసాగుతున్నాయట.


పవన్ కళ్యాణ్ చేస్తున్న పనుల వల్ల ఆయన ప్రతిపక్షంలో లేరు అధికారపక్ష డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్నారు. నిజాలను నిగ్గు తేల్చాల్సింది పోయి.. ఏపీలో గొడవలు కొట్లాటలు వచ్చేలా చేస్తున్నారన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విధంగా ఇప్పటికే చాలామంది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా గొడవలే జరుగుతున్నాయంటూ మాట్లాడుకుంటున్నారట. ఇలాంటి సమయంలో సహనంతో వ్యవహరించాల్సిన పవన్ ఏవేవో ప్రకటనలు చేస్తున్నారు.కొన్నేళ్లుగా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని హిందువులు మౌనంగా ఉన్నారని.. సనాతన ధర్మం కోసం చనిపోయిన పర్వాలేదంటూ ఏవేవో ప్రకటనలు చేస్తున్నారు.


పవన్ కళ్యాణ్ లో ఫైర్ ఉన్న.. శ్రీవారి లడ్డు విషయంలో అసలు ఏం జరిగింది దోషులు ఎవరు అనే విషయాన్ని విచారించాల్సింది పోయి కేవలం వివాదాన్ని రాజుకునేలా చూస్తున్నారట. ఈ విషయం పైన అటు కూటమి నేతలు అలాగే ఆయన కుటుంబం మెంబెర్స్ కూడా సంతోషంగా లేరని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది మాత్రం అసలు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అనే విధంగా ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: