ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే వరదల ముంపు కారణాలవల్ల చాలా మంది ప్రజల ఆస్తిపాస్తులు ధ్వంసం కావడమే కాకుండా ఇంటి సామాగ్రి కూడా లేకపోవడం జరిగింది. మరి కొంతమందికి ఇల్లే లేదని తెలియజేస్తున్నారు. ఇందులో చాలామంది ప్రజలు కూడా తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. దీంతో ఏపీ ప్రభుత్వం గుర్తించి ఈ రోజున వరద బాధితులకు నష్టపరిహారం కింద కొంత డబ్బును జమ చేయబోతున్నారు. వరదల కారణంగా భారీగానే ఆస్తి నష్టం జరిగింది.. సుమారుగా 4 లక్షల మంది వరద బాధితులు ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు 597 కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.


కేవలం విజయవాడలోనే లక్షలమంది పైగా బాధితులు వరద సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. 179 సచివాలయాల పరిధిలో ఎంక్వయిరీ చేశామని ఒక నివేదిక ద్వారా ముంపు  ప్రభావిత ప్రాంతాలలో నష్టం గణన వేసి వారందరికీ నష్టపరిహారం ఇస్తున్నట్లుగా తెలియజేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ రోజున ఈ వరద బాధితుల ఖాతాల DBT ద్వారా నేరుగా పరిహారాన్ని వరద బాధితుల అకౌంట్లోనే జమ చేసే విధంగా చేస్తున్నారట ఏపీ సీఎం చంద్రబాబు. అర్హుల జాబితాలను సచివాలయంలో ప్రదర్శించామన్నట్లుగా తెలియజేశారు


అయితే కొన్ని ప్రాంతాలలో వరద ప్రభావితం కింద రాలేదని అందుకే కొన్నిచోట్ల సర్వే నిర్వహించలేదు అనే విధంగా తెలియజేశారు. ఇల్లు, దుకాణాలు, వ్యాపారస్తులు ,చిన్న తరహా పరిశ్రమలు ,పంటలు, పశువులు ఇలా ఆర్థిక సహాయం అందించబోతోందట ఏపీ ప్రభుత్వం. అలాగే ముంపు ప్రాంతాలలో కూడా బ్యాంకుల ద్వారా 180 కోట్ల మేరకు రుణాలను ఇప్పించే విధంగా రీ షెడ్యూల్ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేస్తోంది. నిబంధనలందరికీ ఈ ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ల వద్ద ఈ ప్యాకేజ్ ని సైతం ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా అందించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: