కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 2024 ఎన్నికల ఫలితాలు మరీ సానుకూలంగా రాలేదు. బీజేపీ తమ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కప్పి పుచ్చేందుకు జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేయాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు జమిలి ఎన్నికలు శాపంగా మారే ఛాన్స్ కూడా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి చెప్పుకొచ్చారు. జమిలి ఎన్నికలు అమలులోకి రావాలంటే రాజ్యాంగంలో ప్రధానంగా ఆరు సవరణలు చేయాలని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు చెప్పుకొచ్చారు. జమిలి ఎన్నికలు నియంతృత్వానికి దారి తీసే పరిస్థితులు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకు బీజేపీ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
కాంగ్రెస్ పార్టీకి 2014 సంవత్సరం నుంచి వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని పదవికి సరైన అభ్యర్థి లేకపోవడమే కాంగ్రెస్ పార్టీకి శాపమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 2029 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో చూడాల్సి ఉంది. సరైన ప్రణాళికలతో ముందుకెళ్తే పార్టీకి అధికారం దక్కడం కష్టమేం కాదు.
 
జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం వెనుక ఉన్న వ్యూహాలు ఏంటనే చర్చ సైతన్ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. జమిలి ఎన్నికలు దేశ ప్రగతికి మేలు చేస్తాయో కీడు చేస్తాయో చూడాలి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ రేంజ్ లో మరో రాజకీయ పార్టీ పుంజుకోవడం కూడా సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినేట్ ఆమోదం లభించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే చర్చ సైతం సోషల్ మీడియాలో జరుగుతోంది. జమిలి ఎన్నికల విషయంలో దాఖలైన పిటిషన్లపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: