ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు చుట్టూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో... కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాలలో.. స్వయంగా ముఖ్యమంత్రిలే కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో.. ఇరుక్కోగా... కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం.. మూడా స్కాంలో అడ్డంగా దొరికిపోయారు.
ఇక్కడ విషయం ఏంటంటే మంగళవారం రోజునే.. సీఎం రేవంత్ రెడ్డి అలాగే సిద్ధరామయ్య లకు కోర్టు నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో.. ఓటుకు నోటు కేసు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నాంపల్లి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత తొమ్మిది నెలలుగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి కోర్టుకు రావడంలేదని... కేవలం తన తరఫు లాయర్ ను మాత్రమే పంపిస్తున్నాడని సీరియస్ అయింది.