ఇప్పుడు వాళ్లకు ఎలాంటి పదవులు కనుచూపుమేరలో కూడా వచ్చే పరిస్థితులు లేవు. మరీ ముఖ్యంగా సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి నేతలు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి.. నిరాశ మిగిలేలా కనిపిస్తోంది. తాజాగా ప్రకటించిన జాబితాలో బీజేపీ నుంచి లంక దినకర్‌కు మాత్రమే అవకాశం దొరికింది. అయన కూడా మాజీ టిడిపి నేత అని చెప్పాలి. టికెట్ల విషయంలో వైసీపీ కోవర్టులుగా టీడీపీ భావించే నేతలకు అస్సలు ఛాన్స్ దక్కలేదు. సోము వీర్రాజు, జివిఎల్ విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వలేదు. అయితే వీరు స్థాయి కార్పొరేషన్లో కంటే ఎక్కువ అని.. ఎమ్మెల్సీ పదవుల కోసం వీరు ఎదురు చూసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది.
కానీ.. ప్రస్తుత పరిస్థితి చూస్తే.. వారికి అసలు పదవులు ఇచ్చేందుకు పరిగణలోకి అయినా.. చంద్రబాబు తీసుకుంటారా అన్న సందేహాలు వస్తున్నాయి. ఇదంతా వైసీపీకి సానుభూతిపరులు అవునో.. కాదో.. కానీ టీడీపీని మాత్రం గట్టిగా వ్యతిరేకిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ వైసీపీ పక్క పక్కన పెడితే.. పైన చెప్పుకున్న ముగ్గురు నేతలు వైసీపీ అవుతుంది. దానికి ఎలాంటి కారణాలు ఉన్నాయో తెలియదు కానీ.. వైసీపీతో బీజేపీ ఎప్పటికీ పొత్తులు పెట్టుకోలేని పరిస్థితి. టీడీపీతోనే కలుస్తుంది. టీడీపీతో కలిసినప్పుడు ఈ వైసీపీ అభిమానం వల్ల వారికి పదవులు రావడం సాధ్యం కాదు. దీంతో వీరు రాజకీయాల్లో ఒక స్థాయికి ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఘోరంగా విఫలమవుతున్నాయి అని చెప్పక తప్పదు.