గతంలో ఆ పార్టీకి రాజ్యసభలో బలమైన సంఖ్యా బలం ఉంది. ఇప్పుడు ఎంపీలు వరుస పెట్టి రాజీనామా చేస్తుండడం పార్టీకి మైనస్ గా మారింది. విచిత్రం ఏంటంటే కృష్ణయ్య రాజ్యసభ పదవి వదులుకోవటం నిజంగా చంద్రబాబు - పవన్ కళ్యాణ్ కు చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆయనకు మరో నాలుగేళ్ల పాటు పదవీకాలం ఉంది. రాజ్యసభ చైర్మన్ కూడా కృష్ణయ్య రాజీనామాను ఆమోదించారు. త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ సీటును కచ్చితంగా కూటమి దక్కించుకోనుంది. కూటమిలో తెలుగుదేశం లేదా జనసేన నుంచి ఎవరు పోటీ చేసినా కృష్ణయ్య స్థానంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం కచ్చితంగా కూటమి ఖాతాలో పడుతుంది.
ఈ రాజ్యసభ పదవీ కాలం ఏకంగా నాలుగు సంవత్సరాలు ఉంది. కూటమి నుంచి ఎంపికయ్యే రాజ్యసభ సభ్యుడు ఎవరైనా ఏకంగా నాలుగేళ్ల పాటు హ్యాపీగా పదవిలో ఉండనున్నారు. అలాగే నాలుగేళ్ల పాటు టీడీపీ ఖాతాలో లేదా కూటమి పార్టీలలో ఎవరో ఒకరికి నాలుగేళ్ల రాజ్యసభ సభ్యత్వం దక్కనుంది. ఇది నిజంగా బాబు - పవన్ కృష్ణయ్యకు హ్యాట్సాఫ్ చెప్పుకునే సందర్భమే అనుకోవాలి.