ఆంధ్రప్రదేశ్లో కూటమి గా జతకట్టినప్పటి నుంచి ఏవో ఒక ఇబ్బందులు అటు టిడిపి, జనసేన, బిజెపి పార్టీల మధ్య ఏర్పడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో కూడా గెలవడంతో కాస్త ఈ విషయాలు సర్దు మునిగిన కానీ అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కూటమి నేతలే కూటమి ప్రభుత్వాన్ని కొన్ని సందర్భాలలో నిలదీస్తూ ఉన్నారు. వైసిపి పార్టీ నుంచి కూటమిలోకి ప్రవేశిస్తున్న నాయకులను కూడా చాలామంది నేతలు విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీలోకి చేరబోతున్నట్టుగా కొన్ని ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేయగా వాటిని చించేస్తూ ఉన్నారు టిడిపి కార్యకర్తలు.


అయితే ఇప్పుడు మళ్లీ తాజాగా ఒంగోలులో రాజకీయం రసవత్తంగా మారుతున్నది.. జనసేన పార్టీలోకి వైసిపి మాజీ మంత్రి బాలినేని చేరడానికి సిద్ధమవుతున్న సమయంలో ఆయన అభిమానులు కొన్ని ఫ్లెక్సీలను స్వాగతిస్తూ ఏర్పాటు చేయగా రాత్రి సమయంలో కొంతమంది గుర్తి తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను సైతం చించివేసినట్లుగా సమాచారం. అయితే ఇది ఎవరు చేశారని ఆరా తీయగా బాలినేని జనసేన పార్టీలోకి చేరడం అటు టిడిపి, జనసేన ఒంగోలు నేతలకు ఇష్టం లేకపోవడం వల్లే ఇలా చేశారనే విధంగా ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నాయి.


గడచిన మూడు రోజుల క్రిందట కూడా బాలిలేని ఫ్లెక్సీల విషయంలో టిడిపి కార్యకర్తలు చాలా ఘోరంగా ప్రవర్తించారు. ఈ విషయం పైన అక్కడ స్థానిక ఎమ్మెల్యే దామచర్ల టిడిపి ఎమ్మెల్యే ఫోటో ఉండడమే అన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇలా గడిచిన మూడు రోజుల నుంచి ఒంగోలులో ఫ్లెక్సీలో వార్ నడుస్తూనే ఉన్నది. మరి బాలినేని రావడానికి కూటమి నేతలకు ఇష్టం లేదన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం వైసిపి నేతలను ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నారు. మరి కార్యకర్తలకే మింగుడు పడని నాయకులను నేతలు చేర్చుకోవడం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: