ప్రస్తుత దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు గురించి వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు తారీకు రాష్ట్రాల వివాదం కాస్త దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే ఈ లడ్డు కల్తీ అనేది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని నారా చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో.. వివాదం రాజుకుంది. దీనికి తోడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. క్రైస్తవ మతానికి సంబంధించిన వాడు కావడంతో.. మరింత అగ్గిరాజుకుంది ఈ వివాదం.

అయితే.. ఈ లడ్డు వివాదం నేపథ్యంలో ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డిని తిడుతూనే ఉన్నారు. హిందూ సంస్థలు, బిజెపి నేతలు కూడా మండిపడుతున్నారు. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టి ఎందుకు...  తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా తానే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని... డిసైడ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి.

 అంతేకాదు తిరుమల శ్రీవారి వద్దకు కాలినడకన.. అలిపిరి మార్గంలో వెళ్లాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఈ విషయం మళ్లీ హాట్ టాపిక్ అయింది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే... మళ్లీ హీరో అయిపోతారు. అయితే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ తొక్కేందుకు.. కూటమి పార్టీలు కొత్త ఎత్తుగడ వేసినట్లు వైసిపి నేతలు చెబుతున్నారు.  తిరుమల డిక్లరేషన్ పైన సంతకం చేయాలని.. ఆ తర్వాతే తిరుమలకు వైయస్ జగన్ వెళ్లాలని ఈ కూటమి పార్టీ నేతలు డిమాండ్ చేయడం జరుగుతుంది.


వాస్తవానికి తిరుమల డిక్లరేషన్ బ్రిటిష్ కాలం నుంచి ఉంది. హిందువులు కాకుండా ఏ మతం వారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే... కచ్చితంగా తిరుమల డిక్లరేషన్ ఫారం పైన సంతకాలు చేయాల్సి ఉంటుంది. 1933 నుంచి  ఇది అమల్లో ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ క్రైస్తవ మతస్థుడు కాబట్టి.. దీనిపై సంతకం చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఐదుసార్లు వరుసగా ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారని... ఈ తరుణంలో డిక్లరేషన్ పైన సంతకం చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు వైసిపి నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: