దేవర, వర పాత్రలకు తారక్ ప్రాణం పోశారనే చెప్పాలి. తాతకు తగ్గ మనవడని జూనియర్ ఎన్టీఆర్ మరోసారి ప్రూవ్ చేశాడు. కొరటాల శివ రొటీన్ కథనే ఎంచుకున్నా కథనం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సినిమాలో గూస్ బంప్స్ మూమెంట్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు. ఆచార్య సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న నేపథ్యంలో రిస్క్ లేకుండా కొరటాల శివ దేవర తెరకెక్కించారు.
అయితే తెలుగు రాష్ట్రాల వరకు దేవరకు కలెక్షన్ల పరంగా సమస్య లేదు కానీ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రేంజ్ ఏంటనేది ఇప్పుడే చెప్పలేము. బాహుబలి, సలార్, కల్కి రేంజ్ అని చెప్పలేము కానీ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ దేవర అని కచ్చితంగా చెప్పవచ్చు. క్రిటిక్స్ లో ఎక్కువమంది సైతం దేవర సినిమాకు పాజిటివ్ రేటింగ్స్ వస్తున్నాయి. అయితే కొరటాల శివ మరింత కష్టపడి ఉంటే ఈ సినిమా రేంజ్ పెరిగేది.
దేవర సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించకుండా ఒక పార్ట్ లో ఈ సినిమాను తెరకెక్కించి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర ఫస్ట్ పార్ట్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉండగా క్లైమాక్స్ ట్విస్టుల విషయంలో ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉండగా ఈ సినిమా నిర్మాతలకు లాభాల పరంగా ఎక్కువ మొత్తంలో లాభాలను ఇచ్చే ఛాన్స్ ఉంది.