రెండున్నరేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఆయుధాలు అయిపోతున్నాయ్.. చిట్టెలుకలా భావించిన ప్రత్యర్థి ఎంతకూ లొంగడం లేదు.  దానికి నుంచి పాశ్చాత్య దేశాల మద్దతు ఆపడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. భారత ప్రధాని మోదీ సాగిస్తున్న శాంతి ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడం లేదు. మోదీని మించి మరే నాయకుడికి పుతిన్ ను ఆపే శక్తి లేదు. తాజాగా ఆయన ఓ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.


తమపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న దేశానికి అణుశక్తి కలిగిన మరో దేశం సహకరిస్తే దానిని తీవ్రంగా పరిగణిస్తామని పుతిన్ తేల్చి చెప్పారు. దీని వెనుక ఆయన ఉద్దేశం ఏమిటో తెలుస్తుంది. ఈ హెచ్చరిక అమెరికాను ఉద్దేశించినదే. లేదా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలకు సంబంధించినది కూడా. కాగా.. అణ్వాస్త్రాలు లేని దేశం చేసే దాడికి మద్దతు పలికితే.. అది రెండు దేశాలు కలిపి చేస్తున్నట్లు భావిస్తామని కూడా పుతిన్ పేర్కొన్నారు. అంటే ఉక్రెయిన్ మద్దతుగా ఉన్న దేశాలను ఉద్దేశించి మాట్లాడారు.


పుతిన్ ఇప్పుడే కాదు.. ఉక్రెయిన్ పై యుద్ధం మొదలు పెట్టిన 2022 ఫిబ్రవరి 24 తర్వాత కొద్ది రోజులకే అణ్వాయుధాన్ని వాడతామని హెచ్చరించారు. అయితే ఆ పరిస్థితి రాలేదు. ఇప్పుడు చేసిన హెచ్చరికతో తామిచ్చే జవాబు అణ్వాయుధాలతోనా? అనేది చెప్పలేదు. కాగా.. ఉక్రెయిన్ కు నాటో దేశాలు పెద్ద ఎత్తున ఆయుధాలు అందిస్తున్నాయి. వాటితోనే ఇప్పటి వరకు అది పోరాడుతూ వస్తోంది.


తాజాగా జెలన్ స్కీ కూడా మరిన్ని ఆయుధాలు ఇస్తే రష్యాను ఓడిస్తానని ప్రకటన చేశారు. నాటో ఉక్రెయిన్ కు దీర్ఘ శ్రేణి ఆయుధాలు అందించింది. వాటిని ప్రయోగిస్తే.. అది రష్యా నాటో యుద్ధంగానే చూస్తామని పుతిన్ అంటున్నారు. తాము ఇచ్చే ఆయుధాలపై అమెరికా అమెరికా సహా నాటో దేశాలు ఉక్రెయిన్ కు కొన్ని పరిమితులు విధించాయి. వాటిలో దీర్ఘ శ్రేణి ఆయుధాలు కూడా ఉన్నాయి. అయితే రష్యా అణు ముసాయిదాలో ఇటీవల మార్పులు చేశారు. దీని ప్రకారం శత్రువుల విమానాల ద్వారా భారీ దాడులు చేయడం, క్రూజ్ క్షిపణులు.. డ్రోన్లను ప్రయోగిస్తే అణ్వస్త్రాలను వాడేందుకు రష్యా నిర్ణయం తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: