యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకులను మెప్పించారా లేదా అనే ప్రశ్నకు 80 శాతం మంది ప్రేక్షకులు మెప్పించారని చెబుతున్నారు. అయితే దేవర2 సినిమాకు కొన్ని ట్విస్టులు కీలకం కానున్నాయి. సినిమాలో వర పాత్రకు సంబంధించి చివర్లో రెండు ట్విస్టులు ఇచ్చారు. సీక్వెల్ లో వర పాత్ర ఉంటుందా? ఉండదా? అనే ప్రశ్నతో పాటు దేవరలో ఉన్న బాహుబలి టైప్ ట్విస్ట్ కు ఎలాంటి జవాబు ఇస్తారనే స్పష్టత రావాల్సి ఉంది.
 
అదే సమయంలో సినిమా స్టార్టింగ్ లో ఎక్కువగా వినిపించిన యతి అనే గ్యాంగ్ స్టర్ పాత్ర ఎవరు? ఆ పాత్రకు దేవర కథకు లింకేంటి? మురుగ పాత్ర ఎవరి చేతిలో చనిపోయాడు? సీక్వెల్ లో దేవర పాత్రకు స్కోప్ ఎంత? జాన్వీ కపూర్ పాత్రకు కథలో ప్రాధాన్యత ఉంటుందా? ఉండదా? రాయప్ప చేసిన నమ్మకద్రోహం వరకు తెలుసా? తెలీదా? వర భయస్థుడిలా నటించడం వెనుక అసలు కారణాలేంటి? అనే ప్రశ్నలకు సమాధానంగా దేవర2 తెరకెక్కే ఛాన్స్ ఉంది.
 
అదే సమయంలో డీసీపీ పాత్రలో కనిపించిన అభిమన్యు సింగ్ చేయి విరగడానికి కారణం ఏంటి? భైరా పాత్ర ఏం చేయబోతున్నాడు? బాబీ డియోల్ నిజంగానే దేవర సీక్వెల్ లో నటిస్తారా? అనే ప్రశ్నలకు జవాబులు దొరకాల్సి ఉంది. దేవర2 సినిమాలో చిక్కుముడులు ఎక్కువగానే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సీక్వెల్ 2027 లేదా 2028లో రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది.
 
దేవర ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి. దేవర సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే మూవీ కాగా తారక్ ఈ సినిమాతో ట్రిపుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేసే ఛాన్స్ అయితే ఉంది. ఏ ప్రముఖ వెబ్ సైట్ కూడా ఈ సినిమాకు 2.5 కంటే తక్కువ రేటింగ్ అయితే ఇవ్వలేదు. ఆచార్య లాంటి సినిమా అయితే కాకపోవడం దేవర సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: