శ్రీవారి మహా ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగింది అని బాంబు లాంటి వార్తను సీఎం హోదాలో చంద్రబాబు పేల్చారు. ఆయన యథాలపంగా అన్నా కూడా ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. క్షణాల్లో దేశం దాటి ప్రపంచానికి తాకింది. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది రాజకీయ ఆరోపణలగా ఉంటుందని బహుశా టీడీపీ భావించి ఉండొచ్చు.


 కానీ ప్రపంచ దేవుడు అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం అన్నది అతి సున్నితమై అంశం. పైగా సెంటిమెంట్ తో కూడుకున్నది. దాందో కోట్లాది మంది భక్తులు ఈ మొత్తం వ్యవహారం మీద కలవర పడ్డారు. వారంతా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఇష్యూ మొత్తం వేరే కోణంలోకి వెళ్లిపోయింది. ఇక్కడ రాజకీయం దాటి మరీ ది సెన్సిటివ్ ఇష్యూగా పరిణామం చెందింది. దాంతో పాటు దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవతున్నాయి. లడ్డూ ప్రసాదం కల్తీ అయితే విచారణ జరిపించి నిగ్గు తేల్చాలి కానీ.. ఇలా బాహాటంగా ఆరోపణలు చేసి కోట్లం మంది అమాయక భక్తుల మనోభావాలను దెబ్బతీయడం ఏంటనే చర్చ కూడా సాగుతోంది.


ప్రధానంగా విశ్వహిందూ పరిషత్ వంటి ధార్మిక సంస్థలు ఈ విషయంలో టీడీపీని సైతం తప్పు పట్టాయి. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీని రాజకీయంగా బదనాం చేయాలని టీడీపీ ఆలోచించి ఉండొచ్చు. కానీ ఇది అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ మెడకు కూడా చుట్టుకునేలా ఉంది. ఎందుకంటే వైసీపీ ఈ విషయంలో సీబీఐ విచారణ కోరుతోంది. అలాగే న్యాయ విచారణకు సైతం పట్టుబడుతోంది.


లడ్యూ ఇష్యూలో బాధ్యుల మీద చర్యలు ఉండాలని కోరుతున్న వామపక్షాలు కాంగ్రెస్ వంటి సంస్థలు కూడా దీనిని సీబీఐకి అప్పగించాలని కోరుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం సిట్ తో సరి అంటోంది. సిట్ అంటే అందులో పనిచేసే అధికారుల అంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటారు. సీఎం బాహాటంగా లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేసిన క్రమంలో దీనికి భిన్నంగా రాష్ట్ర స్థాయి అధికారులు నివేదిక ఇవ్వగలరా అనే చర్చకూడా నడుస్తోంది.  ఏది ఏమైనా ఈ ఇష్యూ తేలాక ఎవరి చేతులు కాలుతాయో మాత్రం ఇప్పటికే చర్చగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: