తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఈడీ అధికారుల దాడులు ప్రారంభం కావడం జరిగింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు విపరీతంగా టిఆర్ఎస్ పార్టీ నేతల ఇండ్లలో ఈడి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి చాలా రోజులు గ్యాప్ ఇచ్చారు ఈడి అధికారులు. అయితే ఇప్పుడు మళ్లీ... ఈడి అధికారులు యాక్టివ్ అయ్యారు. నేరుగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడి అధికారులు.. దాడులు చేస్తున్నారు.

 ఎవరికి సమాచారం ఇవ్వకుండా శుక్రవారం ఉదయం నుంచి పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు అలాగే బంధువుల నివాసాలలో... ఈడి అధికారులు సోదాల నిర్వహించడం జరుగుతోంది. శుక్రవారం రోజున మొత్తం ఈడీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై దాడులు చేశారు. టీడీఎస్ అలాగే వాచ్ల కొనుగోలు వ్యవహారంపై వీడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలుగా వచ్చిన ఈడి అధికారులు... 15 గ్రూపులుగా విడిపోయి దాడులు నిర్వహించడం జరుగుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు విదేశాల నుంచి... అక్రమంగా వాచులను తీసుకువచ్చారని.. గతంలోనే వార్తలు వచ్చాయి. అలాగే టిడిఎస్ స్కాం కూడా..  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబం మెడకు చుట్టుకుంది. దాదాపు 650 కోట్ల నుంచి 800 కోట్ల వరకు... పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబం స్కామ్ చేసినట్లు.. వీడికి సమాచారం వచ్చిందట.

 దీంతో శుక్రవారం రోజున...  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలలో దాడులు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా.. భారీగానే నగదు దొరికినట్లు చెబుతున్నారు. అయితే ఈడి దాడుల వెనుక.. బడే బాయ్, చోటే బాయ్  ఇద్దరు బ్రదర్స్ ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని గులాబీ పార్టీ నేతలు.. చెబుతున్నారు. కావాలనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని... ఆ ఇద్దరు బ్రదర్స్ ఇరికిస్తున్నారని గులాబీ నేతలు.. ఆరోపణలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: