* క్రికెట్ గాడ్ గా సచిన్ అంతర్జాతీయంగా గుర్తింపు
* ఎన్నో రికార్డ్స్, ఎన్నో రివార్డ్స్ ఆగని ప్రవాహంలా సచిన్ రికార్థుల పరంపర
* భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ అందుకున్న మొదటి క్రీడాకారుడు..
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన జీవితం అంతా క్రికెట్ కే అంకితం ఇచ్చిన టెండూల్కర్ భారతదేశం గర్వించదగ్గ ఆటగాడు..అన్ని దేశాలలో గొప్ప బ్యాట్స్మెన్ ల అందరికి సచిన్ అంటే ఎంతో గౌరవం ఆయనను స్ఫూర్తిగా తీసుకోని వారు తమ కెరీర్ లో రానిస్తూ వుంటారు.. సచిన్ తన 11 ఏళ్ల వయసు లో మొదటిసారి బ్యాట్ పట్టారు.. 14 ఏళ్ల వయస్సులో, అతను తన పాఠశాల మ్యాచ్‌లో 664 ప్రపంచ రికార్డ్ స్టాండ్‌లో 329 స్కోర్ చేయడానికి దానిని ఉపయోగించాడు. అతను బాంబే తరపున తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు. సచిన్ 16 సంవత్సరాల వయస్సులో అతను భారతదేశపు అతి పిన్న వయస్కుడైన టెస్ట్ (అంతర్జాతీయ) క్రికెటర్ అయ్యారు..నవంబర్ 1989లో కరాచీలో పాకిస్తాన్‌పై సచిన్ అరంగేట్రం చేశారు.23 సంవత్సరాల వయసులో భారత దేశ జట్టుకు కెప్టెన్ గా నియమించబడ్డారు.సచిన్ తన కెరీర్ లో ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ అందుకున్నారు. టెండూల్కర్ 2007 లో వన్డే అంతర్జాతీయ (ODI) ఆటలో ఏకంగా 15,000 పరుగులు నమోదు చేసిన మొదటి ఆటగాడిగా సచిన్ నిలిచాడు.. అలాగే 2011లో టెస్ట్ ఆటలో కూడా ఏకంగా 15,000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మన్ గా సచిన్ రికార్డ్ క్రియేట్ చేసారు. అలాగే దక్షిణాఫ్రికా జట్టుపై ఏకంగా డబుల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించారు.