భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ముహమ్మద్ అజహరుద్దీన్ గురించి క్రికెట్ లవర్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో 1963 సంవత్సరంలో జన్మించిన ముహమ్మద్ అజహరుద్దీన్ ఆల్ సెయింట్స్ హైస్కూల్లో చదువుకుని నిజాం కాలేజ్ నుంచి బీకాం డిగ్రీ సాధించారు. క్రికెట్ లో తనకు మాత్రమే సాధ్యమైన ఆటశైలితో అజహరుద్దీన్ ప్రశంసలు అందుకున్నారు.
 
1984 సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగిన టెస్ట్ మ్యాచ్ తో అజహరుద్దీన్ క్రికెటర్ గా కెరీర్ ను మొదలుపెట్టారు. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అజహరుద్దీన్ పై బీసీసీఐ నిషేధం విధించింది. అయితే 2012 సంవత్సరంలో కోర్టు అజహరుద్దీన్ పై నిషేధం ఎత్తివేసింది. అయితే క్రికెటర్ గా రాణించిన అజహరుద్దీన్ రాజకీయాల్లో సైతం సత్తా చాటి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
 
యూపీలోని మురాదాబాద్ డివిజన్ నుంచి పోటీ చేసిన ఆయన 49,107 మెజారిటీతో ఎన్నికల్లో గెలవడం కొసమెరుపు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో కాంగ్రెస్ జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా అజహరుద్దీన్ ను ప్రకటించడం జరిగింది.
 
ఢిల్లీ బ్యాడ్మింటన్ సంఘం (డీబీఏ) అధ్యక్షుడిగా అజహరుద్దీన్ ను ఎంపిక చేయడం జరిగింది. అజహర్ తన మొదటి భార్య నౌరీన్ కు విడాకులు ఇచ్చి నటి సంగీతా బిజలానీని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆయన మొదటి భార్యకు ఇద్దరు సంతానం కాగా సంతానంలో ఒకరైన అయాజుద్దీన్ 2011 సెప్టెంబరు 11 న ఔటర్ రింగ్ రోడ్డులో పుప్పాలగూడ దగ్గర జరిగిన బైక్ ప్రమాదంలో గాయాలపాలై చనిపోయారు. అజహరుద్దీన్ ను అభిమానించే ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలోనే ఉన్నా ఆయనను విమర్శించే వాళ్లు సైతం ఎక్కువగానే ఉన్నారు. అజహరుద్దీన్ రాజకీయాల్లో సైతం తన ముద్ర వేశారనే చెప్పాలి.
 


 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: