భారత క్రికెట్ జట్టుకు అద్భుతమైన సేవలను అనేక సంవత్సరాలు అందించిన ఆటగాళ్లలో హర్భజన్ సింగ్ ఒకరు. ఈయన తన అద్భుతమైన బౌలింగ్ తో టీమిండియా జట్టుకు ఎన్నో విజయాలను అందించిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఈయన కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా కొన్ని మ్యాచ్ లలో తన బ్యాట్ తో కూడా ప్రత్యార్థులకు చుక్కలు చూపించిన సందర్భాలు ఉన్నాయి. అలా హార్భజన్ బ్యాటింగ్ లో కూడా అద్భుతమైన స్కోరులు సాధించిన ఇన్నింగ్స్ లు చాలానే ఉన్నాయి. అలాగే ఫిల్డింగ్ లో కూడా ఈయన తన అద్భుతమైన ఆట తీరుతో భారత జట్టుకు విజయాలను అందించడం మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించిన సందర్భాలు ఉన్నాయి.

ఇలా టీమిండియా క్రికెట్ జట్టు లో అనేక సంవత్సరాల పాటు అద్భుతమైన స్థాయిలో సేవలు అందించిన హర్భజన్ సింగ్ రాజకీయాలలో కూడా తనదైన స్థాయిలో దూసుకుపోయాడు. 2022 వ సంవత్సరం మార్చి నెలలో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ రాష్ట్రం నుండి తమ ఐదుగురు అభ్యర్థులలో ఒకరిగా సింగ్‌ ను రాజ్యసభకు నామినేట్ చేసింది. అందులో అతను ఏకగ్రీవంగా గెలిచాడు. మరియు అధికారికంగా పార్లమెంటు , రాజ్యసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరం జూలై 18 వ తేదీన పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి రోజున పంజాబ్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఈయన ప్రమాణం చేశారు.

ఇలా హర్భజన్ సింగ్ భారత క్రికెట్ జట్టుకు ఎన్నో సంవత్సరాలు అద్భుతమైన సేవలను అందించి మంచి గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఆ తర్వాత రాజకీయాలలోకి రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా తనదైన స్థాయిలో సక్సెస్ ను సాధించాడు. ఇక భారత క్రికెట్ జట్టుకు ఎన్నో సంవత్సరాల పాటు సేవలను అందించిన హర్భజన్ సింగ్ కొంత కాలం క్రితమే టీం ఇండియా క్రికెట్ జట్టుకు రిటైర్మెంట్ ను ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: