తాజాగా.. బీసీ నేతల సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.... తనకు రెడ్డిలు అలాగే వెలమల ఓట్లు అస్సలు వద్దంటూ బాంబు పేల్చారు తీన్మార్ మల్లన్న. రెడ్డిల ఓట్లు... అసలు వేయకూడదని కోరారు. ఒకవేళ మళ్లీ తాను పోటీ చేస్తే... రెడ్డి ఓట్లు అస్సలు అడగను అని పేర్కొన్నారు. తనకు బీసీల ఓట్లు చాలని... ఆ ఓట్లు పడితే తాను గెలుస్తానని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. అనవసరంగా రెడ్డిలు తనకు ఓటు వేయకూడదని కోరారు.
అయితే తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. తీన్మార్ మల్లన్న పై తిరుగుబాటుకు రెడ్డి సామాజిక వర్గ నేతలు రెడీ అయ్యారు. అంతేకాదు తీన్మార్ మల్లన్న పై.... పోలీస్ కేసు కూడా పెట్టారు రెడ్డి సామాజిక వర్గ నేతలు. ఒక కులాన్ని కించపరిచేలా తీన్మార్ మల్లన్న మాట్లాడాడని... అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. రెడ్డి సామాజిక వర్గం డిమాండ్ చేస్తోంది.
ఈ మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అలాగే ఇకపైన... తీన్మార్ మల్లన్నకు రెడ్డి సామాజిక ఓటర్లు ఓటు వేయకూడదని ఈ సందర్భంగా నేతలు కోరారు. అటు వెలమకుల సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా మొన్నటి బీసీ సంక్షేమ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. ఇకపైన రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోడని... తెలంగాణకు బీసీ సామాజిక నేతిని సీఎం అవుతాడని తెలిపారు.