మన దేశంలో క్రికెట్ ను ఇష్టపడే వాళ్లు ఏ స్థాయిలో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ భారత క్రికెట్ ఆటగాడిగా మొహమ్మద్ కైఫ్ కు మంచి గుర్తింపు ఉండగా మన దేశం తరపున మొహమ్మద్ కైఫ్ టెస్టులు, ఓడీఐలు ఆడాడు. 2000 సంవత్సరంలో అండర్-19 ప్రపంచ కప్‌లో మన దేశం తరపున అండర్ 19 క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి మొహమ్మద్ కైఫ్ విజయం సాధించడం జరిగింది.
 
2018 జూలై 13 న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి కైఫ్ రిటైర్ అయ్యారు. అలహాబాద్‌లో 1980 డిసెంబరు 1 న మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మొహమ్మద్ కైఫ్ కాన్పూర్ లో ఉన్న గ్రీన్ పార్క్ హాస్టల్‌తో తన కెరీర్ ను మొదలుపెట్టారు. మన దేశం తరపున అన్సారీ రైల్వేస్ క్రికెట్ జట్టుకు, ఉత్తర ప్రదేశ్ క్రికెట్ జట్టుకు ఆయన ఆడటం జరిగింది. 2011 సంవత్సరంలో కైఫ్ జర్నలిస్ట్ పూజా యాదవ్ ను పెళ్లి చేసుకోవడం జరిగింది.
 
2005 సంవత్సరం జులై నాటికి మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన రాష్ట్ర క్రికెటర్లు ఐదుగురిలో కైఫ్ ఒకరు కాగా జాతీయ ఓడీఐ జట్టుకు ఆయన కెప్టెన్ గా పని చేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి ప్రశంసలు అందుకున్న కైఫ్ 2014 లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్ నుండి పోటీ చేయగా ఎన్నికల్లో ఆయనకు ఆశించిన ఫలితాలు రాకపోవడం గమనార్హం.
 
భారతీయ జనతా పార్టీకి చెందిన కేశవ్ ప్రసాద్ మౌర్య చేతిలో ఆయన ఓటమి పాలవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో తర్వాత రోజుల్లో ఆయన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ వచ్చారు. మొహమ్మద్ కైఫ్ క్రికెట్ లో ఎన్నో సంచలనాలు సృష్టించి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. మొహమ్మద్ కైఫ్ రాజకీయాల్లో కూడా సత్తా చాటి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: