ఏ మహిళ కూడా "నన్ను రేప్ చేయండి" అని ఎవరినీ అడగదు. కానీ ఒక సుడాన్ మహిళ మాత్రం ఈ హార్ట్ బ్రేకింగ్ రిక్వెస్ట్ చేసింది. ఆమె స్టోరీ తెలిస్తే ఎవరైనా సరే కంటతడి పెట్టుకోవాల్సిందే. మరి ఆమె ఎవరో, ఎందుకు అలా అడుగుతుందో తెలుసుకుందాం. సూడాన్ దేశంలో 17 నెలలుగా సాగుతున్న తీవ్ర అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఆ దేశ రాజధాని ఖార్టుమ్‌లో మిలటరీ దాడులు రక్తపుటేరులను భావిస్తున్నాయి. ప్రత్యర్థులైన ర్యాపిడ్ సపోర్టివ్ ఫోర్సెస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా ఆ దేశ మిలటరీ సిబ్బంది ఎటాక్స్ చేస్తోంది.

అంతర్యుద్ధం మొదలైన కొద్ది రోజులకే రాజధాని ఖార్టుమ్‌లోని ఎక్కువ ప్రాంతాన్ని ఆర్ఎస్‌ఎఫ్ తమ ఆధీనంలోకి తీసుకుంది. నైలు నదికి అవతలవైపున ఉండే ఖార్టూమ్ జంట నగరం ఓందుర్మాన్‌ మాత్రం వారు తమ గుప్పిట్లోకి తీసుకోలేకపోయారు. అయితే, రెండు సిటీలలో ప్రజలు నివసిస్తూనే ఉన్నారు. తమ రోజు వారీ పనులు చేసుకుంటూనే ఉన్నారు. మహిళలు గుంపులుగా వెళ్లి మార్కెట్లో కూరగాయలు కూడా కొనుగోలు చేసుకుని వస్తున్నారు. అలాంటి ఒక మార్కెట్ దగ్గర బార్బరా ప్లెట్ అషర్ అనే ఒక సూడాన్ మహిళా మీడియాతో మాట్లాడింది. ఆమె మాటల ద్వారా అక్కడ లైంగిక దాడులు ఎంత దారుణంగా జరుగుతున్నాయో తెలిసింది.

ఆర్ఎస్ఎఫ్ దళాలు ఈ కీచక పర్వానికి తెర లేపారని ఆ మహిళ తెలిపింది. మిరియం (పేరు మార్పు) అనే మరొక మహిళ తనకు జరిగిన అత్యంత దారుణమైన సంఘటనను మీడియాతో పంచుకుంది. ఆమె ఇప్పుడు సోదరుడితో కలిసి ‘దార్ ఎస్ సలాం’లోని ఇంటిని వదిలేసి వేరే చోటుకు వలస వచ్చింది. టీ కొట్టులో పని చేస్తున్న ఈవిడ యుద్ధం మొదలైన తొలి రోజుల్లో ఒక పిడకల లాంటి రోజును ఫేస్ చేసింది. ఇద్దరు ఆర్మీ జవాన్లు ఆమె ఇంట్లోకి చొరబడి ఆమె పదేళ్ల పాపను, 17 ఏళ్ల అమ్మయిని అత్యాచారం చేయాలనుకున్నారు.

 అప్పుడు ఆమె తన ఇద్దరు అమ్మాయిలను తన వెనక్కి తోసింది. తరువాత "ఎవరినో ఒకరిని రేప్ చేయడమే మీ లక్ష్యమైతే నన్ను రేప్ చేయండి” అని ఆర్ఎస్ఎఫ్ వాళ్ల కాళ్లకు దండం పెడుతూ ఏడ్చేసింది. కానీ వారిలో కనికరం కనిపించలేదు. వాళ్లు ఆమెను దారుణంగా కొట్టారు. ఆమె దుస్తులు విప్పేయాలని హెచ్చరించారు. "దుస్తులు తీసేస్తా కానీ నా పిల్లల్ని వదిలేయండి" అని ఆమె మొరపెట్టుకుందట కానీ ఓ సైనికుడు ఆమె బిడ్డలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంకొకడు ఆమె మీద పడి ఒక పశువు లాగా అత్యాచారానికి తగబడ్డాడు ఈ విషయాలను ఆమే స్వయంగా తెలిపింది. ఆమె స్టోరీ గురించి తెలుసుకున్న చాలా మంది కంటతడి పెట్టుకుంటున్నారు. ఆర్ఎస్ఎఫ్ బలగాలు మానవ హక్కుల కాల రాయకుండా అంతర్జాతీయ సంస్థలు చర్యలు చేపట్టాలని చాలామంది కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: