అలా బాబు ఏకకాలంలో తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పాలించాక వైఎస్సార్ పాలన స్టార్ట్ అయింది. వైఎస్సార్ విషయానికొస్తే, 2004 నుంచి 2009 దాకా ఐదేళ్లకు పైగా సీఎం గా వ్యవహరించారు. ఆ సమయంలో బాబు, వైస్సార్ మధ్య గల స్నేహ బంధం రాజకీయంగా శత్రుత్వంగా మారింది. అయితే రాజకీయంగా వీరు ఇద్దరూ విభేదించినా, బయట ఫంక్షన్ లలో కలుసుకునేటప్పుడు మాత్రం వీరి మధ్య చాలా స్నేహపూర్వక వాతావరణం ఉండేదట. అయితే వైస్సార్ ఎప్పుడు కూడా బాబుని కావాలని వదలలేదట. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం ఏర్పాటు చేసే క్రమంలో వస్తున్న స్పందన చూసిన బాబు సైలెంటుగా వైస్సార్ ని పక్కనబెట్టి టీడీపీలోకి జంప్ అయ్యాడట. ఇక ఆ తరువాత కాలంలో ఎన్టీఆర్ మరణించాక టీడీపీ పగ్గాలు బాబు చేతికి రావడంతో వైస్సార్ వర్సెస్ బాబు అన్న మాదిరి తయారయ్యింది.
ఇకపోతే, ప్రస్తుత రాష్ట్ర రాజకీయం విషయానికొస్తే, వైస్సార్ పాలనలో ఉన్నపుడు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించేవారు. ఇక అప్పుడు ఈ డిక్లరేషన్ వంటి పదాలు వినబడేవి కాదు. కాగా వైఎస్సార్ కూడా క్రిస్టియన్ అయి ఉండి, డిక్లరేషన్ ఇవ్వలేదని ఇపుడు మాటలు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వినబడుతున్నాయి. అవును, అనాడు ఇప్పటిలాగా వైఎస్సార్ తిరుమల వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని కోరుతూ ఇష్యూని వివాదం చేయలేదు. అదే సమయంలో వైఎస్సార్ ని అప్పుడు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు... ఇపుడు జగన్ ని ఎందుకు అడుగుతున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. తనకు మిత్రుడు అని ఆయన అలా వదిలేశారా? లేక మతాన్ని రాజకీయాలోకి తెచ్చి సున్నితమైన అంశాలను కెలకకూడదు అని ఆలోచించారా? అన్నది అర్థం కాని విషయమే. ఏది ఏమైనా ఇపుడు జగన్ విషయంలో ఇన్ని కండిషన్లు పెట్టడం మాత్రం ఒకింత చోద్యమే అని అనుకోక తప్పదు అని విశ్లేషకులు అంటున్నారు.