తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... మరో వివాదంలో చిక్కుకున్నారు. పొట్టి శ్రీరాములు పేరును తొలగించి... కొత్త వివాదానికి తెర లేపారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నేతలు... రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి... సూరవరం ప్రతాపరెడ్డి పేరును ఖరారు చేస్తూ ఇటీవల రేవంత్ రెడ్డి కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత వారం రోజుల కిందట తెలంగాణ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అయితే పొట్టి శ్రీరాములు పేరు మార్చుతూ.. సూరవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టడం పట్ల ఆంధ్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు జాతి గౌరవం కోసం పోరాటం చేసిన పొట్టి శ్రీరాములును అవమాన పరుస్తున్నాడని... అందుకే రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని టీజీ వెంకటేష్ తాజాగా ఫైర్ అయ్యారు. ఇటీవల రేవంత్ రెడ్డి కేబినెట్ తీసుకున్న నిర్ణయం చాలా దారుణమని ఆగ్రహించారు.
ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకున్నాడు అని... కానీ పొట్టి శ్రీరాములు విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సూరవరం పేరు పెట్టాలనుకుంటే కొత్త యూనివర్సిటీ పెట్టి పెట్టుకో అంటూ... రేవంత్ రెడ్డి కి వార్నింగ్ ఇచ్చారు టీజీ వెంకటేష్. కానీ తెలుగు జాతిని ఏకం చేసిన పొట్టి శ్రీరాములను అవమానించకూడదని కోరారు. ఇకనైనా దీనిపై రేవంత్ రెడ్డి కేబినెట్ వెనక్కి... తగ్గాలన్నారు.
ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో.. ఎక్కడ చూసినా కూల్చివేతల రాజకీయం కనిపిస్తోంది. పొద్దున లేస్తే చాలు హైడ్రా దిగిపోతోంది. అటు మూసి సుందరీకరణ పేరుతో... హైదరాబాదులో ఇండ్ల కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం తిరుమల శ్రీవారి లడ్డు గురించి రాజకీయాలు నడుస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందని... దేవాలయం అపవిత్రమైందని వైసిపి వర్సెస్ తెలుగుదేశం కూటమి మధ్య వార్ కొనసాగుతోంది.