తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై.. ఎల్లో మీడియా తిరుగుబాటు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో... సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన అస్సలు బాగాలేదని చెప్పకనే చెబుతున్నాయి ఈ ఎల్లో మీడియాలు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ని జోకిన ఈ మీడియా సంస్థలు... జనాల్లోంచి వ్యతిరేకత రావడంతో.... రూట్ మార్చేశాయి. రేవంత్ రెడ్డి కి మొట్టికాయలు వేసినట్లు వార్తలు రాస్తున్నాయి. మీడియా ఛానల్లో కూడా వార్తలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే వస్తున్నాయి.

 

మొన్నటి వరకు రేవంత్ రెడ్డి చిన్న పని చేసిన కూడా పొగిడేవారు. ఆకాశానికి ఎత్తేవారు. కానీ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు, మూసి సుందరీకరణ పేరుతో ఇండ్ల ధ్వంసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్... గ్రౌండ్ స్థాయిలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.  ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ నగరంలో తిరిగితే కొట్టే పరిస్థితి ఉంది. అంతటి స్థాయిలో జనాల్లో వ్యతిరేకత వచ్చింది. అభివృద్ధి పైన దృష్టి పెట్టకుండా జనాల ఇండ్లను కూల్చడం పై.. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

 

ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతాల్లో జనాలు అయితే... రేవంత్ రెడ్డికి మద్దతు పలికిన మీడియా సంస్థలపై కూడా దాడులు చేసేలా కనిపిస్తున్నారు.  అయితే ఈ పరిణామాలను గ్రహించిన ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ... రూట్ మార్చేశారు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డికి పాజిటివ్గా వార్తలు రాసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ... తాజాగా ఆయన సంపాదకీయంలో... రేవంత్ రెడ్డి ని గట్టిగానే... ప్రశ్నించారు. జాగ్రత్త రేవంత్ రెడ్డి అంటూ హెచ్చరించారు.

 

ఇకనుంచి నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే...  పరిస్థితి వేరే లాగా ఉంటుందని కూడా వార్నింగ్ ఇచ్చారు ఏబీఎన్ రాధాకృష్ణ. తన సంపాదకీయం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వ  వైఫల్యాలను ఎండగట్టారు. ఇకనైనా తేలుకోకపోతే రేవంత్ రెడ్డికి కచ్చితంగా నష్టం వాటిల్లుతుందని అర్థం వచ్చేలా.. రాసుకొచ్చారు. హైదరాబాదులో కూల్చివేతలు కచ్చితంగా ఆపాల్సిందేనని అర్థం వచ్చేలా... హెచ్చరించారు. మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: