మెగా కుటుంబ సభ్యులు ఈ మధ్యకాలంలో పొలిటికల్ పరంగా బాగానే యాక్టివ్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్, నాగబాబు మెగా కుటుంబ సభ్యులు అందరూ కూడా పోరాడుతూనే ఉన్నారు. ఎట్టకేలకు 2024 కూటమిలో భాగంగానే జనసేన పార్టీకి మంచి పేరు లభించింది. ఎన్నో ఏళ్లుగా జనసేన పార్టీని వెంటపెట్టుకొని మరి ఉన్న మెగా బ్రదర్ నాగబాబు కు ఇప్పుడు రాజకీయంగా అదృష్టం కలిసొస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి నుంచి లోక్సభకు పోటీ చేస్తారనుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత ఆసిటిని త్యాగం చేయవలసిన నాగబాబుకి ఇప్పుడు మరొకసారి అదృష్టం తలుపు తడుతోందట.



ఇటీవలే వైసిపి పార్టీ నుంచి ఆర్ కృష్ణయ్య సడన్గా రాజీనామా చేయడంతో ఇప్పుడు మూడవ ఎంపీ సీటు కూడా ఖాళీ అయింది. ఆర్ కృష్ణయ్య తన నాలుగేళ్ల రాజ్యసభ పదవీ కాలాన్ని ఇలా వదిలేసుకోవడం జరిగింది. దీంతో పెద్దల సభలో మెగా బ్రదర్ నాలుగేళ్ల పాటు ఉండడం అంటే అది అదృష్టమని చెప్పవచ్చు. గతంలో కూడా రాజ్యసభ వైసీపీ ఎంపీలు ఇద్దరు రాజీనామా చేశారు.అందులో ఒకరు టిడిపి వారని ఎంపిక చేయాలని ఆ పార్టీ అధిష్టానం కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం.


అయితే ఇప్పుడు కొత్తగా మరొక మూడవ సీటు ఖాళీ కావడంతో జనసేన పార్టీకి ఆ సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు అది కూడా నాగబాబుకి ఇవ్వబోతున్నారనే వార్తలు కూటమిలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలా ఒక సీటు నాగబాబుకు మిగిలిన రెండు సీట్లు చంద్రబాబు తమ పార్టీ నుంచి పంపిస్తారని విధంగా వినిపిస్తున్నాయి. మరి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో సమయంలో నాగబాబుకి ఈ గోల్డెన్ అవకాశం దక్కుతుందో లేదో చూడాలి మరి.ఒకవేళ ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా మెగా కుటుంబ సభ్యులకు ఈసారి ఎన్నికలు ఒక అరుదైన రికార్డు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: