ఒక నెలరోజులు లేదా రెండు నెలలపాటు తిరువూరు వ్యవహారాలు చూసుకోవాలని కృష్ణ ప్రసాద్కు చంద్రబాబు సూచిస్తారని తెలుస్తోంది. అప్పటికి పరిస్థితులు చక్కబడితే మళ్లీ కొలికపూడికి మెల్లగా బాధ్యతలు ఇస్తారు.. ఈ లోపు కూడా ఆయన సర్దుబాటు కాకపోతే అక్కడ ప్రత్యామ్నయం చూస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తదుపరి నిర్ణయం నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించి తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ హై కమండ్ చెబుతున్న మాట. కొలికపూడి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయనకు ఎవరితోనూ సత్సంబంధాలు లేవు. అందరితోను వివాదాలే చివరకు ఆయనకు అపరమైన కవరేజ్ ఇచ్చే ప్రోత్సహించిన ఆంధ్రజ్యోతి మీడియా సంస్థను కూడా ఆయన దూరం చేసుకున్నారు.
పైగా ఆంధ్రజ్యోతి నా వెంట్రుక కూడా పీకలేదు అంటూ ఆయన ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇక అక్కడ ఉన్న కార్యకర్తల విషయంలో చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాలంటే ఒకరు నేర్పేవి కాదని ఆయనకు అర్థం అవుతుందో లేదో కానీ ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలలకే పరిస్థితి చేయి దాటిపోయే వరకు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే అనే వ్యక్తి పార్టీ కార్యకర్తలకు.. అటు నియోజకవర్గ ప్రజలకు అనుసంధానంగా ఉండాల్సింది పోయి ప్రతిదానికి తాను చెప్పిందే వేదం తాను చెప్పినట్టే వినాలి.. అన్న ధోరణతో పోవటం వల్లే కొలికపూడి మూడు నెలలకే సొంత పార్టీ కేడర్ నుంచే తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకున్న పరిస్థితి.