తాజాగా తిరుమల లడ్డు వివాదం పై వైఎస్ జగన్ తో పాటు వైసిపి నేతలపై హైదరాబాద్కు చెందిన బిజెపి మహిళ నేత మాధవి లత చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పక్క రాష్ట్రంలో ఉండేవారికి ఆంధ్ర రాజకీయాలు ఎందుకని ? ప్రశ్నించిన నాని హిందువులపై అమితమైన ప్రేమ ఒలక పోస్తున్న తాను ... తన ఆసుపత్రిలో హిందువులకు బిల్లులు తగ్గించారా అని నిలదీశారు. గతంలో అన్య మతస్తుడు అయిన ఏపీ గవర్నర్ ప్రధాని మోడీతో పాటు తిరుమల వెళ్లారని అప్పుడు బిజెపి నేతలు ఎందుకు ఆయనను ప్రశ్నించలేదని పేర్ని నాని నిలదీశారు. అన్యమతస్తుడు అని మతస్తుడిని డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఎందుకు తీసుకువెళ్లారని మోడీని ఎందుకు ప్రశ్నించలేదు అన్నారు పేర్ని నాని.
తాజాగా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలతో బీజేపీని వైసిపి నేరుగా టార్గెట్ చేసినట్టు క్లియర్గా అర్థం అవుతుంది. తిరుమల లడ్డు విషయంలో గత కొద్ది రోజులుగా బిజెపి నేతల ప్రాపకం కోసం తెగ ప్రయత్నించి విఫలం అయింది వైసిపి. ఇక ఆ పార్టీ నుంచి తమకు ఎలాంటి సహకారం దొరకదని ఫిక్స్ అయ్యారో ఏమోగానీ ఇప్పుడు ప్రధానిని కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయడం చర్చనీయాంశం అవుతుంది. బిజెపిని ప్రశ్నించడం ద్వారా జాతీయ స్థాయిలో మరికొన్ని పార్టీల మద్దతు అయినా తమకు లభిస్తుందన్న ఆశలతో ఈ విషయంలో మోడీని సైతం వైసీపీ టార్గెట్ చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.