- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )

సాధారణ ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్‌కు అన్ని విషయాలు ఎదురు వస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఎదురు దెబ్బలు తప్పడం లేదు. పార్టీ నుంచి పలువురు కీలక నేతలు వరుస‌పెట్టి బయటికి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటినుంచి పార్టీని పటిష్టం చేసుకుంటూ పునాదులు బలోపేతం చేసుకుంటూ రాకపోతే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ నుంచి పోటీ చేసేందుకు కూడా ఎవరు ముందుకు రారు అన్న విషయం జగన్కు అర్థమైంది. 2019 ఎన్నికలలో వైఎస్ కుటుంబం మొత్తం జగన్ వెంట ఉంది.. అదే 2024 ఎన్నికలకు వచ్చేసరికి తల్లి విజయలక్ష్మితో పాటు చెల్లి భారతి రెడ్డి మరో చెల్లి సునీత రెడ్డి ఇలా వైఎస్ కుటుంబంలో చాలామంది జగన్కు వ్యతిరేకం అయిపోయారు.


వీరు జగన్తో మళ్ళీ క‌లుస్తారా లేదా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి తన భార్య వైఎస్ భారతి రెడ్డిని పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు మొదలు పెట్టేసారు జగన్ . వైఎస్ భారతి రెడ్డికి ఓ నియోజకవర్గ పగ్గాలు కూడా ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తుంది. కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి గా వైఎస్ భారతి రెడ్డిని జగన్ నియమించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ నుంచి గత రెండు ఎన్నికలలో సుధీర్ రెడ్డి పోటీ చేస్తూ వస్తున్నారు. 2019లో భారీ మెజార్టీతో గెలిచిన సుధీర్ రెడ్డి గత ఎన్నికలలో బిజెపి నుంచి పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు.


సుధీర్ రెడ్డి ఎవరో కాదు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి స్వయానా బావమరిది. కావడం విశేషం వాస్తవానికి సుధీర్ రెడ్డికి జగన్ కు మధ్య కాస్త గ్యాప్ అయితే వచ్చింది. మొన్న ఎన్నికల్లోనే జగన్ అయిష్టం గానే సుధీర్ రెడ్డికి సీటు ఇచ్చారు. ఈ క్రమంలోని ఇప్పుడు సుధీర్ రెడ్డిని తప్పించేసి జమ్మలమడుగు పార్టీ పగ్గాలు తన భార్య భారతీ రెడ్డి కి ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో భారతి రెడ్డి కచ్చితంగా పోటీ చేస్తారు అన్న సంకేతాలు ఇచ్చేసినట్టే. అలాగే ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టీ పరంగా ఆమె ప్రాధాన్యం మరింత పెంచాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: