ఈ రెండు అంశాలకు బాగా పోలిక ఉంది. రెండు రాష్ట్రాలలోను ఇవి ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్స్. రెండు అత్యంత సంచలన విషయాలే. అలా.. ఇలా కాదు. అత్యధిక శాతం ప్రజలపై నేరుగా ప్రభావం చూపేవి. ఏపీది అయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఇక తెలంగాణ అంశం కూడా తక్కువేమీ కాదు. ఈ రెండు అంశాలను చూసినట్లయితే..


తిరుమల లడ్డూ విషయంలో ఒకటి మాత్రం నిజం. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా చేశారో.. లేక యథాలపంగా చేశారో తెలియదు కానీ.. వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. అదీకాక జగన్ క్రౌస్తవుడు కావడం.. తిరుమలలో జరిగే పుణ్య కార్యాలకు సతీసమేతంగా ఎన్నడూ హాజరు కాకపోవడం వంటి కారణాల రీత్యా ఈ ఆరోపణకు బలం చేకూరింది.


దీంతో తేరుకొని వైసీపీకి ఎదురు దాడి, డ్యామేజ్ కంట్రోలో చేసుకునే పనిలో పడింది. మరోవైపు సుప్రీం కోర్టు కూడా స్పందించి కేసును టేకప్ చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కూడా తమ దర్యాప్తును వేగవంతం చేసింది. తిరుమలలో మకాం వేసి మరీ సంబంధిత వ్యక్తులను పిలిపించుకొని విచారణ చేపడుతోంది.


ఇక తెలంగాణ విషయానికొస్తే.. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, కుంటలను ఆక్రమించుకొని కట్టిక అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ హైడ్రా వాటిని కూల్చివేయడం ప్రారంభించింది. ప్రారంభంలో ప్రజల నుంచి స్పందన బాగుంది. కానీ తర్వాత మెల్లమెల్లగా దీని గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. హైడ్రా కేవలం బడా బాబుల పాలిట కాకుండా సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని కూల్చి వేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. కూల్చివేతలపై విమర్శలు పెరగడంతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. అనుమతులు లేని నిర్మాణాలపై మాత్రమే ఫోకస్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇతర సమస్యలు, హామీలను పక్కదోవ పట్టించడానికే ఈ అంశాలను తెరపైకి తెచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి వీటికి ముగింపు ఎప్పుడు ఉంటుందో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: