మెగా బ్రదర్ నాగబాబు రాజకీయ పంట పండుతోంది. ఆయన రాజకీయ జీవితం సరికొత్త  మలుపు తిరగనుంది అంటున్నారు. అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీ చేయకుండా త్యాగం చేసిన నాగబాబు కి ఇప్పుడు అదృష్టం మెయిన్ డోర్ తట్టి మరీ లోపలకి వస్తోంది అని అంటున్నారు. లేకపోతే వైసీపీ నుంచి ఆర్ కృష్ణయ్య అనూహ్యంగా రాజీనామా చేయడం, ఆ విధంగా మూడో ఎంపీ సీటు ఖాళీ అవడం అంత ఒక లక్ లానే అంటున్నారు.


ఆర్.కృష్ణయ్య అలా తన నాలుగేళ్ల రాజ్యసభ పదవీ కాలాన్ని అలా వదిలేసుకున్నారు. దీంతో పెద్దల సభలో నాలుగేళ్ల పదవీ కాలం అంటే అది బంగారు పళ్లెంలతో పాటు దక్కే ఛాన్స్ అని అంటున్నారు. అంతకు ముందు ఇద్దరు రాజ్యసభ వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఆ రెండు ఎంపీ సీట్లలో టీడీపీ వారినే ఎంపిక చేయాలని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయించినట్లు ప్రచారం సాగింది.


అయితే ఇప్పుడు మూడో ఎంపీ సీటు ఖాళీ అవడంతో ఇది జనసేనకు ఇస్తారని అంతా అంటున్నారు. నాగబాబుకే ఆ సీటు కన్ఫర్మ్ అయిందని కూడా చెబుతున్నారు. నాగబాబుని రాజ్యసభకు పంపడం ఖాయమని.. మిగతా రెండు సీట్లతో చంద్రబాబు తన పార్టీ నాయకులని ఎంపిక చేస్తారని అంటున్నారు.


మరోవైపు కేంద్ర మంత్రి వర్గంలో కూడా టీడీపీకి రెండు పదవులు దక్కాయి. అప్పట్లోనే జనసేనకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం సాగింది. ఇప్పుడైనా మంత్రి పదవి ఆ పార్టీకి దక్కుతుందని పలువురు అంటున్నారు. అదే నిజం అయితే.. పెద్లల సభకు ఎన్నికైన నాగబాబుకి మంత్రి పదవి కూడా దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. అదే కనుక జరిగితే మెగా కుటుంబంలో ఒక అరుదైన పొలిటికల్ రికార్డు సాధించినట్లు అవుతుంది. మెగా స్టార్ చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి పవన్ కల్యాణ్ ఏపీలో మంత్రిగా ఉన్నారు. ఇక నాగబాబు కూడా మంత్రి అయితే ముగ్గురు అన్నదమ్ములు మంత్రులు అయిన రికార్డు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: