2024 ఎన్నికలలో టిడిపి, జనసేన ,బిజెపి అభ్యర్థుల ఒక్కటిగా మాట్లాడుకొని ఒక్కొక్కరు ఒక్కోచోట పోటీ చేసేలా ప్లాన్ చేశారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడి భారీ విజయాన్ని అందుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా కూడా అప్పగించడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న ఒక ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయట. ఎన్నికలలో వైసిపి పార్టీ దూరంగా ఉన్నప్పటికీ టిడిపి జనసేన మధ్య ప్రధాన పోటీ జరుగుతున్నట్లు కనిపిస్తోంది.


పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉండగా ఒకరి పైన మరొకరు పోటీ దిగేందుకు అటు టిడిపి, జనసేన పార్టీలు సిద్ధమయ్యాయట. ఐదుగురు డైరెక్టర్ పదవులకు సైతం ఎన్నికలు జరగబోతున్న వేళ ఈ ఎన్నికలలో ఎవరికి వారు అభ్యర్థులను సైతం నిలబెట్టుకునేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారట.. జనసేన పార్టీ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ తమ అభ్యర్థులను సైతం పోటీ దించేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఐదుగురు డైరెక్టర్ పోస్టులను ఎన్నుకోవడానికి 12 మంది అభ్యర్థులు కలిసి ఒకరిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఈ పదవులను ఏకగ్రీవం చేసుకునేవి.. కానీ ఈ ఎన్నికలకు పోటీకి దూరమైన వైసీపీ ఇక 18 మంది నామినేషన్ వేయగా ఇందులో 6 మంది విత్డ్రా కావడం జరిగిందట. కానీ ఇప్పటికే అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయించారు. వచ్చే నెల 6వ తేదీన ఎన్నికలు జరగబోతున్న వేళ అటు టిడిపి, జనసేన నేతల మధ్య ఒక వార్ నడిచేలా కనిపిస్తోంది.. మరి అధిష్టానం ఈ విషయాన్ని గుర్తించి టిడిపి, జనసేన నేతలకు సర్దు చెబుతుందా లేకపోతే జనసేన,టిడిపి మధ్య పోటీ తప్పదా అనే విషయం చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: