తిరుమల శ్రీవారి లడ్డు కల్తి వివాదం లో... సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను నిందిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. లడ్డు కల్తీ జరిగినట్లు ఎక్కడ రుజువులు లేవని సుప్రీంకోర్టు చెప్పడం... జరిగింది. సరైన ఆధారాలు చూపించడంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విఫలమైందని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు పైన మొట్టికాయలు కూడా వేసింది సుప్రీంకోర్టు.

 ఇవాళ సుప్రీంకోర్టులో తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో విచారణ జరిగింది.అలాగే తిరుమల శ్రీవారి లడ్డు వివాదం పై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. లడ్డులో కల్తీ జరిగిందని నిర్ధారించారా? టెస్ట్ చేశారా.? అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. కల్తీ జరిగింది నీకు గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డు తయారీలో వినియోగించారా? లేదా అనేది క్లారిటీ లేదని వెల్లడించింది.


ఒకవేళ వినియోగించినట్లయితే వాటి ఆధారాలు కూడా ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఎలాంటి విచారణ జరగకుండానే లడ్డు కల్తీ జరిగిందని.. ఎలా ప్రకటిస్తారని కూడా మండిపడింది. హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా స్వయంగా చంద్రబాబు నాయుడు... మాట్లాడడం ఏంటని నిలదీసింది సుప్రీంకోర్టు.  కల్తీ జరిగిందని మీరే చెప్పి... ఆధారాలు ఇవ్వకుండా విచారణ కోసం సిట్ ఎలా ఏర్పాటు చేస్తారని కూడా ప్రశ్నించింది. వైసీపీని టార్గెట్ చేస్తూ... హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడింది సుప్రీంకోర్టు.  

ఇక ఈ తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం పై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేయడం జరిగింది. గురువారం రోజు వరకు ఈ కేసు వాయిదా పడింది. ఇక సుప్రీంకోర్టు తీర్పు వైసీపీకి అనుకూలంగా రావడంతో... ఆ పార్టీకి చెందిన రోజా,  ఇతర వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు తిరుమల శ్రీవారి తగిన బుద్ధి చెప్పారని... హెచ్చరిస్తున్నారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు... హిందువుల మనోభావాలతో ఆడుకోకూడదని.. చురకలాంటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: