ఆంధ్రాలో వైసీపీ పార్టీ ఓడిపోయి నాలుగు నెలలు పూర్తి అయ్యింది. గడిచిన ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని చలాయించింది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నో సంక్షేమ పథకాల పైన దృష్టి పెట్టి స్కూల్స్, వైద్యం, విద్య వంటి వాటిని  పూర్తిగా మార్చి వేశారు. ఆయనప్పటికీ కేవలం 40 శాతం ఓటింగ్ సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి.. కూటమికి భారీ విజయాన్ని అందించడమే కాకుండా 164 సీట్లతో భారీ విజయాన్ని అందుకోవడం జరిగింది. అయితే ఇలా కూటమి అత్యధిక మెజారిటీతో రావడానికి ముఖ్యకారణ వైసిపి కంటే ఎక్కువ ఇచ్చిన హామీలే అని చెప్పవచ్చు.


అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తూ ఉన్న.. పాలన ఎలా ఉందనే విషయం పైన పలువురు నేతలు విశ్లేషించారట.. అయితే ఈ పాలన 60 నెలలలో ఆరు శాతం భాగమే అన్నట్టుగా సమాచారం. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం కూటమి పాలనలో దిగువ మధ్యతరగతి వారు చాలా అసంతృప్తిగా ఉన్నారని అందుకు కారణం సంక్షేమ పథకాలు ఇంకా అమలు చేయకపోవడమే వైసిపి పార్టీ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు వాటి ఊసే ఎత్తలేదని చర్చ జరుగుతోందట.


అలాగే మరొకవైపు సూపర్ సిక్స్ హామీలను కేవలం పెన్షన్ మాత్రమే తీసుకువచ్చారు.మిగిలిన వాటివన్నీ కూడా పట్టించుకోలేదని చర్చ జరుగుతోందట. కానీ ఇప్పటికే ప్రజలలో అక్కడక్కడ కూటమినేతల పైన కూడా అసంతృప్తి కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రోడ్లు డెవలప్మెంట్ కూడా చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా వాలంటరీలు కూడా ఆందోళన చెందుతున్నారు.అంతేకాకుండా ప్రతి ఏడాది ఉద్యోగాలు విడుదల చేస్తామని  నిరుద్యోగులకు తెలియజేశారు.ఉద్యోగుల పిఆర్సి విషయంలో కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని.. ఉద్యోగులకు సంబంధించి ఇంక్రిమెంట్ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకుంటామని ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు..ఇప్పటికే మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిని అమలు చేయాలంటూ చాలామంది నేతలు కూటమి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారట. మరి ఈ నాలుగు నెలల తర్వాత ఆయన కూటమి ప్రభుత్వం తమ పందా చూపిస్తుందేమో చూడాలి. వైసీపీ నేతలు కూడా కూటమి ప్రభుత్వం పైన సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఒత్తిడి చేయడంతో.. కల్తి నెయ్యి లడ్డు వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం బయట పెట్టింది.. ఇది కూడా కూటమికి చిక్కులు తెచ్చేలా కనిపిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: