ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ అయ్యిందంటూ చంద్రబాబు ఆనా రచ్చ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రసాదం కల్తీ విషయంపై నిన్న విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు చంద్రబాబుకు మొట్టికాయలు వేసింది. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయడం కుదరదంటూ ఏపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది సుప్రీంకోర్టు.

కల్తీ నెయ్యి జరిగినట్లు సాక్ష్యాలు ఏవంటూ సుప్రీం అడిగితే ఏపీ ప్రభుత్వ లాయర్ సిదార్థ్ లూథ్రా నీళ్లు నమిలారు. ఏపీ సిట్‌ విచారణ ఎందుకంటూ నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియక తల వంచుకున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డిపై వేసిన నిందారోపణలన్నీ అసత్యాలని స్పష్టం అయ్యింది. తన నీచ రాజకీయాల కోసం పరమ పవిత్రమైన ఏడు కొండల వాడిని వాడుకున్నారు బాబు అండ్ కో, ఈ విషయం అందరికీ అర్థమైంది.

సెప్టెంబరు 18న ఏపీ సీఎం చంద్రబాబు లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ జంతువుల కొవ్వు కలిపిన లడ్డూ ఎక్కువ రోజులు నిల్వ ఉండదనీ, వెంటనే పాడైపోతుందని, దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతూ వచ్చారు, ఈ తతంగమంతా చంద్రబాబు పరిపాలనలోకి వచ్చాకే జరిగింది అయినా సరే అదంతా జగన్ మాత్రమే చేశారంటూ చంద్రబాబు అలియేషన్స్ చేశారు.

ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలాంటి దిగజారుడు ఆరోపణలు చేయడం ఆయనకు తగినది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంపైన, ఆలయ ప్రతిష్ఠపైన, లడ్డూ ప్రసాదం చరిత్రకు మచ్చ వచ్చేలా సీఎం చంద్రబాబు పిచ్చి పూతలు కూశారు అని వైసీపీ నేతలు భారీ ఎత్తున విమర్శిస్తున్నారు. ఇక జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కనీస అవగాహన లేకుండా ఆవేశంతో రెచ్చిపోతుంటారు. లడ్డు ప్రసాదం విషయంలోనూ ఆయన ప్రాక్టికల్ గా ఆలోచించకుండా ఊగిపోతూ, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ రెచ్చిపోయారు. ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో నానా యాగి చేశారు. దుర్గమ్మ గుడికి వెళ్లి మెట్లపూజ కూడా స్వయంగా చేపట్టారు. 

హిందువులందరూ ఒకటై గొడవలు చేయాలంటూ పిలుపునిచ్చారు. దీక్ష చేస్తూనే సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నట్లు కూడా వార్తలు వచ్చాయి మొత్తం మీద పవన్ చంద్రబాబు అసత్యాలు పలుకుతున్నారని తెలుసుకోకుండా ఆయన రాజకీయ వ్యూహంలో బలైపోయారు. 

సుప్రీంకోర్టు లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందని దాఖలైన పిటిషన్లను చాలా సీరియస్ గా తీసుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం విచారణ ప్రారంభించింది. టీటీడీ తరఫు లాయర్ కు చాలా లాజికల్ క్వశ్చన్లను సంధించింది. "మీ వద్ద ప్రసాదంలో జంతువులకు కలిసిందని చెప్పడానికే ల్యాబ్ ఆధారాలు ఉన్నాయా? నెయ్యిని రిజెక్ట్ చేశామని ఈవో చెప్పిన తర్వాత దాన్ని వాడరు కదా? ఈ ఇన్ఫర్మేషన్ అంతా బయటకు తెలుస్తూనే ఉంది కదా? జులైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ దాకా ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదు?. ఎన్డీడీబీతో మాత్రమే ల్యాబ్ టెస్టులు ఎందుకు చేయించారు? మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబ్ నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోపోవడం వెనక కారణం ఏంటి? అసలు కల్తీ నెయ్యిని లడ్డూలో వాడిట్లు ఒక్క ఆధారం కూడా సమర్పించలేకపోయారు." అని టీటీడీ లాయర్ సిదార్థ్ లూథ్రాను సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగింది. 

కల్తీ జరిగినట్టు చెబుతున్న లడ్డూలను పరీక్ష చేశారా చేస్తే వాటి ఆధారాలు ఏవి?, ఈ విషయంలో ఒక నిర్ధారణకు రాకుండానే ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు వంటి ప్రశ్నలు అడుగుతుంటే చంద్రబాబు చేసిన ఆరోపణలు మొత్తం అబద్ధాలు అని తేలిపోయింది. ఈ ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనసులను చంద్రబాబు గాయపరిచారని సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. రాజ్యాంగ పదవిలో ఉండి చంద్రబాబు ఈ సున్నితమైన అంశం గురించి మీడియాకి చెప్పారు. ఈ విషయంలో కూడా చంద్రబాబుకు చివాట్లు పెట్టడం జరిగింది. అలాగే ఈ కేసు పై తదుపరి విచారణను అక్టోబర్ మూడవ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత చంద్రబాబు తన ఇజ్జత్ తానే తీసుకున్నట్లుగా ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: