ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. ప్రస్తుతం తిరుమల లడ్డు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో... ముగ్గురు నేతల గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. ఈ ముగ్గురు నేతలు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ... కూటమిని దెబ్బతీస్తున్నారని... సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. ప్రతి విషయంలో కూటమికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ... జగన్ను లేపుతున్నారని అంటున్నారు. ఆ ముగ్గురు నేతలు ఎవరో కాదు... బిజెపి వారే.

ఆంధ్రప్రదేశ్ బిజెపి మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, జివిఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి ఈ ముగ్గురు... గురించి కూటమి సోషల్ మీడియాలో... నెగిటివ్ గా వార్తలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... ఈ ముగ్గురు నేతలు ఎక్కడా కూడా యాక్టివ్ గా కనిపించడం లేదు.  వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు... ఈ ముగ్గురు నేతలు..  వైసిపికి అనుకూలంగా వ్యవహరించి బయట మాత్రం... జగన్ ను తిట్టినట్లు  చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటికి కూడా ఈ ముగ్గురు నేతలు జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  తిరుమల శ్రీవారి లడ్డు అంశం ఇంత వివాదంగా మారినా కూడా... పక్క రాష్ట్రం బీజేపీ నేతల స్పందించారు తప్ప... ఏపీ బీజేపీ నేతలు మాత్రం స్పందించలేదు. కరుడుగట్టిన బిజెపి వాదులుగా చెప్పుకునే ఈ ముగ్గురు లీడర్లు... ఎక్కడ కూడా విమర్శలు చేయకుండా తప్పించుకున్నారు.


ఈ తరుణంలోనే ఈ ముగ్గురిపై కూటమి సోషల్ మీడియా రెచ్చిపోయి కామెంట్స్ చేస్తోంది. జగన్ వెనుకే ఈ ముగ్గురు నేతలు నడుస్తున్నారని.... ఆయన ఓడిపోయిన కూడా ఆయననే లేపుతున్నారని... మండిపడుతోంది కూటమి సోషల్ మీడియా.మరి ఈ అంశంపై సోము వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి అలాగే జివిఎల్ నరసింహారావు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇది ఇలా ఉండగా తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో చంద్రబాబు కూటమికి ఎదురు దెబ్బ తగిలిన సంగతి మనందరికీ తెలిసిందే. చంద్రబాబు కూటమి ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు మొట్టికాయలు... వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp