తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు... ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్... ఇప్పుడు తీవ్ర గందరగోళానికి గురవుతోంది. పొద్దున లేస్తే చాలు బులుడోజర్లు దిగిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ కూల్చివేతలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ సర్కార్. హైదరాబాదులో చెరువుల పరిరక్షణ కోసం హైడ్రాను తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి... అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు.

 జనాలు నివసిస్తున్న ఇండ్లను కూడా హైడ్రా కూల్చివేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బడా వ్యాపారస్తులు అలాగే రాజకీయ నాయకుల ఇండ్లను కూల్చకుండా మొదటగా పేద ఇండ్లను కూల్చడంతో.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైంది  అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలోనే.... మూసి పరివాహక సుందరీకరణ... పేరుతో.. దాదాపు 20,000 ఇండ్లు కూల్చివేయాలని రేవంత్ రెడ్డి  సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 దీంతో మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న జనాలు కూడా... ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 50 సంవత్సరాలుగా మూసి నది పరివాహక ప్రాంతాల్లో.. బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నామని..  అలాంటి మా ఇండ్లే ఎలా పూల కొడతారని రేవంత్ రెడ్డి పై మండిపడుతున్నారు. అయితే ఈ కూల్చివేతల నేపథ్యంలో.. ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్... అందరికీ హీరోలా కనిపిస్తున్నాడు.

 అందరూ కెసిఆర్ పదేళ్ల పాలనను గుర్తు చేసుకుంటున్నారు. ముసలోడే కానీ మహానుభావుడు అంటున్నారు. ఆయన పాలన బాగుందని మెచ్చుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైదరాబాద్ ఆగమైందని.. మండిపడుతున్నారు హైదరాబాద్ ప్రజలు. వెంటనే కేసీఆర్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చి ప్రజలను కాపాడాలని వేడుకుంటున్నారు. తెలంగాణ భవన్ ను జనతా గ్యారేజ్ లా మారుస్తున్నారు బాధితులు. ఇక అటు కొంతమంది కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేస్తున్నారట.  ఆయన సీఎంగా రాజీనామా చేయకపోతే కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుందని చాలా ఫిర్యాదులు వెళ్లాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: