తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కి ఎంత కష్టతరమైన బాధ్యత తెలిసి వస్తోంది. ఓటమి చెంది పది నెలలు అవుతోంది. పార్టీ గ్రాఫ్ మాత్రం ఎక్కడా పెరగడం లేదు. అదే సమయంలో క్యాడర్ లో నిస్తేజం ఉంది. కేసీఆర్ అయితే ఫాం హౌస్ కే పరిమితం అవుతున్నారు. పార్టీలోని నాయకులు తలో దారి చూసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు అంతా పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నారు.


అలా ఇప్పటికే అర డజన్ మంది దాకా చేరిపోయారు. ఇప్పుడు చూసత్ఏ అది కొంత ఆగింది. దేనికి హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ల మేరకు అని అంటున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేల గోడ దూకుడు మీద స్పీకర్ ఇచ్చిన ఫిర్యాదు మీద ఆయన స్పందన తెలియచేయాల్సి ఉంది. దాంతో దీని మీదనే గులాబీ పార్టీ కోటి ఆశలు పెట్టుకుంది. అయితే స్పీకర్ తన స్పందనను తెలియజేస్తూ కోర్టుకు అన్నీ తెలియజేస్తారు అని అంటున్నారు.


దీంతో ఈ వ్యవహారం ఏదో తేలిన తర్వాత మరింత మంది గులాబీ పార్టీ నుంచి గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ లోకి జంప్ చేసిన నేతలు అంటున్నారు. దీనిపై బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ మాట్లాడుతూ.. తమపైన హైకోర్టులో నడుస్తున్న కేసును బూచిగా చూపించి కాంగ్రెస్ లోకి రావాలని చూస్తున్న ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ అగ్ర నేతలు ఆపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.


అయితే వారంతా కొంత లేట్ కావొచ్చు కానీ.. చేరడం మాత్రం పక్కాగా కాంగ్రెస్ పార్టీలోనే అని ఆయన జోస్యం చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని దానం అన్నారు. దానం ఇలా మాట్లాడటంతో గులాబీ పార్టీలో కలవరం మొదలైంది. కోర్టు ఆదేశాలతో కొంత ఊపిరి పీల్చుకున్న ఆ పార్టీ ఇప్పుడు దానం తాజా కామెంట్స్ తో టెన్షన్ పెట్టిస్తున్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs