- చంద్ర‌బాబుకు పెద్ద త‌ల‌నొప్పిగా ఎమ్మెల్యే కొలిక‌పూడి
- కాంట్ర‌వ‌ర్సీతో పాపుల‌ర్ అయ్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారా.. !
- టీడీపీ అనుకూల మీడియాపై త‌న‌ వెంట్రుక పీక‌లేద‌ని వివాస్ప‌ద వ్యాఖ్య‌లు

( కృష్ణా - ఇండియా హెరాల్డ్ )


కొలిక‌పూడి శ్రీనివాస‌రావు. గ‌త మూడు నెల‌ల కాలం నుంచి వార్త‌ల్లో న‌లుగుతున్న తిరువూరు టీడీపీ ఎమ్మె ల్యే. అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మం నుంచి వెలుగులోకి వ‌చ్చిన కొలిక‌పూడి ఫైర్ బ్రాండ్‌గా ముద్ర వేసుకు న్నారు. ఎమ్మెల్యే కాకముందే.. ఆయ‌న వివాదాల‌తో తెర‌మీదికి వ‌చ్చారు. బీజేపీ నాయ‌కుడు విష్ణు వ‌ర్థ‌న్ రెడ్డిని ఓ టీవీ ఛాన‌ల్ డిబేట్‌లో చెప్పుతో కొట్టిన వ్య‌వ‌హారం కొన్నాళ్ల కింద‌ట తీవ్ర దుమారం రేపింది. ఆ సంగ‌తి మ‌రిచిపోక ముందే.. మ‌రో వివాదంతో కొలిక‌పూడి కార్న‌ర్ అయ్యారు.


వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ త‌ల తెచ్చి ఇచ్చిన వారికి రూ.కోటి కానుక‌గా ఇస్తాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించి.. మ‌రింత వివాదం సృష్టించారు. ఈ ప‌రిణామాలు కొలిక‌పూడిని అత్యంత వివాదాస్ప‌ద నాయ‌కుడిగా మ‌లిచాయి. ఇదిలావుంటే..అమ‌రావ‌తి ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వారిని త‌న పార్టీలోకి చేర్చుకోవాలని భావించిన చంద్ర‌బాబు.. వెంట‌నే కొలిక‌పూడికి కండువా క‌ప్పేశారు. ఆ వెంట‌నే తిరువూరు టికెట్ కూడాఇచ్చారు. గెలిపించారు.


ఇప్పుడు కొలిక‌పూడి వ్య‌క్తిగా కంటే ప్ర‌జాప్ర‌తినిధిగా గుర్తింపు ఉంది. మ‌రి ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఎలా వ్య‌వ‌హ‌రించాలి?  ఎలా ప‌నిచేయాలి?  అనేది అంద‌రికీ తెలిసిందే. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా వ్య‌వ‌హ‌రిం చాలి. అదేవిధంగా ప‌నిచేయాలి. కానీ, కొలిక‌పూడి అలా ప‌నిచేయ‌డం లేదు. పైగా నిరంత‌రం ఏదో ఒక వివాదంతో కాల‌క్షేపం చేస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట వైసీపీ నేత‌కు చెందిన ఇంటిని కూల్చేసే ప్ర‌య‌త్నం చేశారు. తానే స్వ‌యంగా బుల్ డోజ‌ర్ న‌డుపుతూ.. కూల్చేశారు.


అయితే.. అధికారులు మాత్రం అది ఆక్ర‌మ‌ణ కాద‌ని  చెప్పినా కొలిక పూడి వినిపించుకోలేదు. దీనిపై నేరు గా సీఎం చంద్ర‌బాబు స్పందించాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత‌.. ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండు నెల‌లు గడిచినా.. రోడ్లు స‌రిచేయ‌డం లేదంటూ.. తానే స్వ‌యంగా ఆ గోతుల్లోకి దిగి నిర‌స‌న చేప‌ట్టారు. ఇది స‌ర్కారుకే ఇబ్బందిగా మారింది. అనంత‌రం.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తూ.. తాను త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ విసిరారు. దీనిని కూడా చంద్ర‌బాబు తీవ్రంగా ఖండించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు నేరుగా కీల‌క మీడియా ప్ర‌తినిధుల‌పై దుర్భాషలాడుతూ.. వివాదం అయ్యారు.


విలేక‌రుల‌ను బండ బూతులు తిట్టారు. దీనికి కార‌ణం.. మట్టి, ఇసుక త‌ర‌లింపులో ఎమ్మెల్యే హ‌స్తం ఉంద‌ని టీడీపీ అనుకూల ప‌త్రికే బ‌య‌ట పెట్టింది. దీనిని ఆయ‌న జీర్ణించుకోలేక పోయారు. ప్ర‌స్తుతం ఇది తీవ్ర వివాదంగా మారి.. రాష్ట్ర వ్యాప్తంగా జ‌ర్న‌లిస్టులు ఆందోళ‌న‌కు దిగుతున్నారు. చంద్ర‌బాబు సైతం ఈ విష‌యంపై సీరియ‌స్‌గా ఉన్నారు. సో.. ఎలా చూసుకున్నా.. కొలిక పూడి ఒక వివాదం..రెండు రాజ‌కీయాలు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ వ‌చ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: