రాయలసీమలో ధర్మవరం నియోజవర్గం 2024 ఎన్నికలలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అక్కడ వైసిపి నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ ఎన్నికలకు ఒక నెల ముందు వచ్చిన సత్య కుమార్ యాదవ్  అక్కడ గెలవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే సత్య కుమార్ కు ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా ఎన్నికయ్యారు. ఇక అప్పటినుంచి ధర్మారంలో ఎమ్మెల్యేగా తన హవా మరింత కొనసాగిస్తూ ఉన్నారు సత్యకుమార్ యాదవ్.. అయితే గత రెండు మూడు రోజుల నుంచి ధర్మవరంలో కూటమి నేతల మధ్య ఒక వార్ నడుస్తోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వైసీపీ పార్టీ హయాంలో కూడా పనిచేశారట. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలకు సపోర్టుగా నిలిచారని.. ఈయన వల్ల తాము చాలా ఇబ్బంది పడ్డాం అంటూ టిడిపి క్యాడర్ ఇప్పుడు ఫైర్ అవుతోంది. వైసిపి పార్టీ వారికి పనులు చేసి పెట్టారని ఇతర వాళ్లని హింసించే వారంటూ టిడిపి నేతలు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మున్సిపల్ ఎన్నికలలో ఏకపక్షంగా వ్యవహరించారని ఎవరూ కూడా నామినేషన్లు వేయడానికి వీలులేదు అంటూ కూడా అప్పటి మంత్రితో పాటు ఈయన కూడా వత్తాసు పలికారు అంటూ టిడిపి క్యాడర్ తెలియజేస్తోంది.


ఇప్పుడు తాజాగా ధర్మారం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జునను ఎంపిక చేయడంలో ఒక్కసారిగా కూటమిలో అసంతృత్తులు మొదలయ్యాయి. మున్సిపల్ కమిషనర్ని ధర్మారం టిడిపి ఇన్చార్జి అయిన పరిటాల శ్రీరామ్ కూడా వ్యతిరేకించారట. ఈ విషయం పైన ధర్మవరం మున్సిపల్ ఆఫీసులో మంత్రి సత్య కుమార్ కూడా ఒక రివ్యూ ని పెట్టడంతో అక్కడికి కమిషనర్ మల్లికార్జున కూడా వచ్చారు. అయితే అక్కడ టిడిపి శ్రేణులు మాత్రం మల్లికార్జున రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సత్య కుమార్ వెంటనే ఎన్డీఏ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేయగా అక్కడికి పెద్ద ఎత్తున టిడిపి నేతలు ,జనసేన కార్యకర్తలు టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారట. ఒక్కసారిగా మంత్రి క్యాంపు ఆఫీస్ వద్ద ఉద్రిక్తత ఏర్పడడంతో వెనుక గేటు నుంచి మల్లికార్జున పంపించేశారట. దీన్ని బట్టి చూస్తూ ఉంటే సత్యకుమారే మల్లికార్జునను వెనక్కి వేసుకున్నట్టుగా కనిపిస్తోందనీ ధర్మవరంలో కూటమినేతలో ఆగ్రహం తెలుపుతున్నారు.. ఈ విషయం పైన అటు టిడిపి ,జనసేన, బిజెపి నేతల మధ్య కూడా కక్షలు మొదలయ్యాయనే విధంగా కనిపిస్తోంది. అలాగే ధర్మవరంలో పొత్తు ధర్మం తప్పుతోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: