లోతుగా ఆలోచిస్తే అదే నిజం అని అనిపిస్తోంది. మెత‌క‌త‌నం మంచి గుణం అయినప్పటికీ ఓ స్థాయిని దాటితే మాత్రం ప్రమాద కరమే. ఈ విషయం ఆంధ్రా సి‌ఎం చంద్రబాబు విషయంలో నిజమౌతోంది అని విశ్లేషకులు జోష్యం చెబుతున్నారు. అణ‌కువ‌గా ఉంటూ.. త‌న‌ను తాను బాగా త‌గ్గించు కుంటున్నారు అని సొంత పార్టీ నాయకులే అభిప్రాయ పడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అసలు విషయం ఏమిటంటే, కేంద్రంలోని కూట‌మి స‌ర్కారు ఎలాంటి పాత్ర వహిస్తుందో అందరికీ తెలిసినదే. అయినప్పటికీ బాబు కేంద్రం నుండి నిధులు తెచ్చుకునే విష‌యంలో మాత్రం ఇంకా తాత్సారం చేస్తున్నార‌నే విమర్శలు ఎక్కువగా వినబడుతున్నాయి. మరోవైపు కేంద్రానికి ఊతమిచ్చిన బిహార్ పాలిత జేడీయూ కూడా ఇలాగే వ్యవరిస్తోంది అన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. బీహార్ సంగతి పక్కన పెడితే, విజ‌య‌వాడ వ‌ర‌ద‌లు, కాకినాడ వ‌ర‌ద‌లుకి సంబంధించి కేంద్రానికి రూ.6880 కోట్ల ప్రాథ‌మిక ప‌రిహారం కోరుతూ.. బాబు లేఖ పంపించిన సంగతి విదితమే. అయితే ఇది జ‌రిగి నెల రోజులు అయిపోయినా కేంద్రం నుంచి రూపాయి కాసు కూడా రాకపోవడం కొసమెరుపు.

ఇప్పటికే వేలాది మంది త‌మ‌కు అందవలసిన ప‌రిహారం అందలేదని.. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న విషయం విదితమే. మరోవైపు పోల‌వ‌రం నిధులు 12 వేల కోట్ల రూపాయిలలో ఇంత వరకు ఒక్క రూపాయి కూడా కేంద్రం విడుద‌ల చేయ‌లేదు. ఈ విషయంలో ఆంధ్రా మంత్రులు నేరుగా కేంద్రానికి విన్నవిస్తున్నప్పటికీ స్పందించ‌డం లేదు. తాజాగా మ‌రోసారి 7 వేల కోట్లు ఇవ్వాలంటూ.. మంత్రి లేఖ రాశారు. అయినా.. కేంద్రం స్పందించ‌ లేదు. ఇక ఈ ప‌రిణామాల‌ మధ్య గ‌ట్టిగా నిల‌దీసి.. కేంద్రం నుంచి డ‌బ్బులు తెచ్చుకొనే సత్తా బాబుకి లేకుండా పోయిందని విమర్శకులు దారుణంగా చంద్ర బాబు ని ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే బాబు, మోడీకి భయపడుతున్నారా? అనే మాటలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: