మెగా బ్రదర్ నాగబాబు నటుడుగానే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అన్న చిరంజీవితో రుద్రవీణ లాంటి గొప్ప సినిమా తీసి జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. 2014లో తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో 2019లో చేరి ఆ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.


ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో నాగబాబు జనసేన నుంచి అన‌క‌ప‌ల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. టిడిపి, జనసేన, బిజెపి కూట‌మిలో పవన్ కళ్యాణ్ కీలకంగా ఉండటంతో అ సీటు బిజెపి నుంచి సీఎం రమేష్ కు దక్కింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన అన్నకు  అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి వాటికి ఎన్నికలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఉన్న మెజారిటీకి అవి టిడిపి జనసేన బిజెపి పార్టీలకే దక్కనున్నాయి.


ఇప్పుడు వాటిలో ఒక స్థానం నుంచి నాగబాబు రాజ్యసభకు ఎన్నికవ్వ బోతున్నారని.. అదే విధంగా కేంద్ర మంత్రివర్గంలో కూడా ఆయనకు చోటు దక్కుతుందని అంటున్నారు. నాగబాబు కోసమే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ క్యాబినెట్ లో చేరలేదని కూడా అంటున్నారు. ఇలా దీనిబట్టి పవన్ తనను నమ్ముకున్న వారికోసం ఎంతవరకైనా వెళ్తారని.. అదేవిధంగా పొత్తులో భాగంగా జనసేన నుంచి ఎన్నికల్లో తప్పకుండా ముఖ్యమైన నాయకులకు కూడా రాబోయే రోజుల్లో పవన్ కీలక పదవులు పోస్ట్లు న్నారని కూడా అంటున్నారు.

నాగబాబు కోసమే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ క్యాబినెట్ లో చేరలేదని కూడా అంటున్నారు. ఇక  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  తిరుపతి లడ్డు విషయంలో జరిగిన అపచారానికి వేంకటేశ్వరుడిని క్షమాపణలు వేడుకుంటూ కొన్ని రోజుల క్రితం ప్రాయచ్చిత దీక్షని తీసుకున్న విషయం  తెలిసిందే.ఈ మేరకు ఈ నెల రెండున  తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకుని మూడవ తేదీన దీక్ష విరమణ కూడా చెయ్యనున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: