- ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఉద్యోగులు ప‌ని చేయాల‌న్నా క‌ప్పం క‌ట్టాల్సిందే..?
- వైసీపీ ఎంపీపీతో లాలూచీ రాజ‌కీయం.. వ‌సూళ్లు... అవినీతి మ‌యం..?
- కార్య‌క‌ర్త‌ల క‌ష్టంతో గెలిచి వాళ్ల‌నే తొక్కేస్తోన్న వైనం..?


( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )



ఆమె తెలుగుదేశం పార్టీలో తొలిసారి గెలిచిన ఓ మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధి. ఆమెకు టిక్కెట్ ఇవ్వొద్దు మొర్రో అని పార్టీ కేడ‌ర్ అంతా చెప్పినా చంద్ర‌బాబు మాత్రం ఓ మీడియాధినేత ఒత్తిడికి త‌లొగ్గి ఆమెకు సీటు ఇచ్చారు. ఆమె ఆ మీడియాధినేత‌ను ఎలా మాయ చేసిందో కాని.. ఆ కోటాలో సీటు కొట్టేసి ఎమ్మెల్యే అయిపోయింది. ఆ త‌ర్వాత అదే మీడియాధినేత సాయంతో మ‌హిళా + కులం కార్డు ద్వారా మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కించుకోవాల‌ని చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. క‌ట్ చేస్తే గెలిచి మూడు నెల‌లు అవుతుందో లేదో అవినీతి.. దందాల్లో విశ్వ‌రూపం చూపించేస్తోంది.


పార్టీ కేడ‌ర్‌ను ఆమెను ఎంతో క‌ష్ట‌ప‌డి గెలిపించారు. ఇప్పుడు అదే కేడ‌ర్‌ను ఆమె తొక్కేస్తూ... దూరం పెడుతూ న‌ర‌కం చూపిస్తోన్న ప‌రిస్థితి. మూడు నెల‌ల్లోనే ఆమె తీరు ఇంత‌లా మారిపోవ‌డంతో కేడ‌ర్ అవాక్క‌వుతోన్న పరిస్థితి. డీల‌ర్ల‌తో మొద‌లు పెట్టి ఎన్ఆర్‌జీఎస్ వ‌ర్క్‌ల వ‌ర‌కు మొత్తం అమ్మేసుకుంటోంది. సీసీ రోడ్లు వ‌చ్చాయి.. ప‌ర్సంటేజ్ దందా మొద‌లైపోయింది. ఆమె వాటా ఆమెకు ఇవ్వాల్సిందే. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల‌కు మండ‌లానికి రు. 15 - 20 ల‌క్ష‌ల మ‌ధ్య‌లో టార్గెట్లు పెట్టి మ‌రీ వ‌సూలు చేయించిన ప‌రిస్థితి.


ఇక ఆమెకు మంచి మెజార్టీ రావ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ఓ మండ‌ల నాయ‌కుల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేసింది. పైకి చెప్పేది ఒక‌టి లోప‌ల చేసేది ఒక‌టిగా ఉంది ఆమె తీరు. అదేంట‌ని ప్ర‌శ్నిస్తే త‌ర్వాత డీ లిమిటేష‌న్ జ‌రిగితే ఆ మండ‌లం బ‌య‌ట‌కు పోతుంది... ఎక్కువ చేస్తే ఆ మండ‌లం నాయ‌కులు.. ప్ర‌జ‌ల‌తో నాకు సంబంధం లేద‌న్న‌ట్టుగా ఆమె తీరు ఉంద‌ట‌. ఇక వారం రోజుల్లో మూడు రోజులు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటే.. మ‌రో మూడు రోజులు అడ్ర‌స్ ఉండ‌రు.. ఎక్క‌డ ఉంటారో తెలియ‌దు.. ఫోన్ల‌కు దొర‌క‌ని ప‌రిస్థితి. ఇక ఆమె కాన్వాయ్‌లో డీజిల్ కూడా కార్య‌క‌ర్త‌లు పోయించాల్సిందే.. ఆమె గారి చేతి నుంచి పైసా కూడా విద‌ల్చ‌రు.


ఇక ఆమె బావ‌గారేమో నియోజ‌క‌వ‌ర్గంలో ఎస్‌.ఐలు - సీఐలు పోలీస్ శాఖ‌ వ్య‌వ‌హారాలు మొత్తం న‌డిపిస్తారు. ఇక మిగిలిన శాఖ‌లు అన్నీ ఆమె అమ్మ గారి కంట్ర‌ల్లోనే అట‌. ఎమ్మెల్యేను ఏ ప‌నిమీద అయినా క‌లిస్తే.. అమ్మ‌ను క‌ల‌వండి.. అమ్మ‌కు చెప్పండి ఇదే ఆన్స‌ర్ ఆమె నోటి వెంట వ‌స్తోంద‌ని కేడ‌ర్ వాపోతోంది. ఇక
త‌హాసీల్దార్‌, ఎస్‌.ఐ, సీ.ఐ, డిప్యూటీ త‌హ‌సీల్దార్‌.. వీఆర్ఏ, ఆర్‌.ఐ పంచాయ‌తీ ఉద్యోగులు... ఏ శాఖ‌లో ఉద్యోగి అయినా ఇక్క‌డ‌కు రావాలంటే క‌ప్పం క‌ట్టాల్సిందే.. ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే ఊరుకునే నువ్వు నా నియోజ‌క‌వ‌ర్గంలో... నేను ప్ర‌జాప్ర‌తినిధిగా ఉన్న‌ మండ‌లంలో ఎందుకు అని ప్ర‌శ్నిస్తోన్న ప‌రిస్థితి ఉంద‌ట‌. ఆమె పైసా ఖ‌ర్చు పెట్టింది లేదు.. అంతా కార్య‌క‌ర్త‌లు.. చంద్ర‌బాబు పెట్టుకుని గెలిపిస్తే.. ఇప్పుడు ఆమె కార్య‌క‌ర్త‌ల‌ను హింసిస్తూ... పార్టీ ప‌రువును మొత్తం బ‌జారున ప‌డేలా చేస్తోంది. చంద్ర‌బాబు.. పార్టీ అధిష్టానం ఇప్ప‌ట‌కి అయినా ఆమెను కంట్రోల్ చేయ‌క‌పోతే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ నాశ‌నం అయ్య‌యే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని కేడ‌ర్ తీవ్ర ఆవేద‌న స్వ‌రంతో చెపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP