ఇకపోతే, తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30న సంచలన వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా? అని ప్రశ్నించగా ప్రభుత్వం బిక్క ముఖం వేసినట్టు భోగట్టా. దాంతోనే సుప్రీంకోర్టు దేవుడిని, రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించినట్టు తెలుస్తోంది. నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపామని టీటీడీ ఈవో చెప్పారు కదా? ల్యాబ్ వద్ద ఆధారాలు ఉన్నాయా? అంతా పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా? అని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కడిగేయడంతో బాబు అవాక్కయినట్టు తెలుస్తోంది.
రాజ్యాంగ పదవిలో సీఎం ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా ఉండాలి. జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్ లో వివాదం చేయడం ఎందుకు? సిట్ ఎందుకు వేశారు? ఇది దర్యాప్తునకు సరిపోతుందా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. పూర్తిగా తెలియకుండానే ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారు? అని సుప్రీంకోర్ట్ నిలదీసింది. ఈ క్రమంలోనే ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2 రోజుల పాటు సిట్ విచారణను నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.