ఇదిలా వుండగా గత వైఎస్ జగన్ ప్రభుత్వ హాయం లో తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీ లో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యం లో ఈ వ్యవహారం పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఈ సిట్ శనివారం నుంచి తన దర్యాప్తును ప్రారంభించింది. అయితే కలియుగ దైవం శ్రీ వెంటేశ్వరని సన్నిధి లో తయారైన ప్రసాదం లో కల్తీ నెయ్యి వినియోగించడం పై పవన్ కల్యాణ్ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యం లో ఆయన ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు. అందులో భాగంగా విజయవాడ లో కి ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం మెట్లను పవన్ కల్యాణ్ స్వయంగా శుభ్రం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకున్నాు. అక్కడి నుంచి అలిపిరి మెట్ల ద్వారా తిరుమల కు ఆయన పయన మయ్యారు. రేపు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షను విరమించనున్నారు.