ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సంవత్సరాల కాలపరిమితితో ఏపీ సర్కార్ నూతన మద్యం విధానాన్ని ఖరారు చేయగా ఈ ఏడాది అక్టోబర్ నెల 12వ తేదీ నుంచి 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 30వ తేదీ వరకు ఈ విధానం అమలులో ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కాగా మొత్తం 3396 దుకాణాలకు మద్యం లైసెన్స్ ల జారీ దిశగా అడుగులు పడటం గమనార్హం.
 
నిన్న ఉదయం నుంచి ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు కాగా ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకునే అవకాశం ఉండగా ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల రూపాయల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం నాన్ రిఫండబుల్ కావడంతో ఇన్వెస్ట్ చేసేవాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలి.
 
దరఖాస్తు రుసుమును డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంక్ చలానా ద్వారా చెల్లించాల్సి ఉంటుందని చెప్పవచ్చు. ఎక్సైజ్ స్టేషన్లలో నేరుగా డీడీ తీసుకుని చెల్లించాలి. ఈ నెల 11వ తేదీన ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలుకానుంది. లైసెన్స్ దారులు ఈ నెల 12వ తేదీ నుంచి కొత్త దుకాణాలను ప్రారంబించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
 
మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రాంత జనాభాను బట్టి నాలుగు శ్లాబ్స్ లో లైసెన్స్ రుసుములు ఖరారు చేయడం జరిగింది. 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ రుసుము 85 లక్షల రూపాయలుగా ఉంది. రెండో సంవత్సరం ఈ రుసుములపై 10 శాతం పెంచి వసూలు చేయడం జరుగుతుంది. నూతన మద్యం విధానం ద్వారా ఏపీ ప్రజలకు మేలు జరగనుందని తెలుస్తోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: