* ఏపీలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం
* రూ.99 కే చీప్‌ లిక్కర్‌
* ఇతర రాష్ట్రాల వారే..ఏపీకి వచ్చి మద్యం తీసుకుని పోయేలా పాలసీ
* తక్కువ ధరకు మద్యం అందించినా..నష్టాలే


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుబాబులకు చంద్రబాబు నాయుడు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనలో... చాలావరకు.. మద్యం ఏరులై పారిందని మొదటి నుంచి చాలా మంది ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు జగన్మోహన్ రెడ్డి.. ప్రభుత్వంలో.. మద్యం అమ్మకాల కారణంగా... చాలామంది మరణించారని కూటమి పార్టీలు  ఆరోపణలు చేశాయి. అయితే.. మొన్నటి ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి.. మంచి మద్యాన్ని అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు.


దానికి తగ్గట్టుగానే తాజాగా... కొత్త లిక్కర్ పాలసీని తెరపైకి తీసుకువచ్చింది కూటమి సర్కార్. ఈ కొత్త లిక్కర్ స్కాం ప్రకారం... నాణ్యమైన మద్యం, అలాగే తక్కువ ధరకే లిక్కర్  అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్... అందుబాటులోకి తీసుకువస్తుంది కూటమి సర్కార్. అంటే గోవా కంటే... తక్కువ ధరలో ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. మన రెండు తెలుగు రాష్ట్రాలలో... మద్యం తాగడానికి ఎక్కువగా గోవాకు వెళ్తారు మందుబాబులు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రవేశపెట్టిన కొత్త మద్యం పాలసీ ప్రకారం... ఆంధ్రప్రదేశ్ గోవాగా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ మందుబాబులు... దొంగ చాటుగా తెలంగాణ బార్డర్ లో ఉన్న వైన్ షాపులకు వెళ్లి... మద్యం తెచ్చుకునేవారు. కానీ ఈ దసరా నుంచి సీన్ రివర్స్ గా ఉంది. తెలంగాణ మందుబాబులే... ఏపీ బార్డర్ కి వెళ్లి...  దొంగచాటుగా మద్యం తీసుకువచ్చేలా ధరలను తగ్గిస్తున్నారు చంద్రబాబు నాయుడు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా... 3400 మద్యం షాపులకు  పర్మిషన్లు ఇవ్వనుంది కూటమి సర్కార్. పదివేల జనాభా  చొప్పున ఒక వైన్స్ షాప్  ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పదివేల నుంచి 50 వేల మంది  ఉన్నచోట ఒక వైన్ షాప్  కు దాదాపు 50 లక్షల ఫీజు కట్టాల్సి ఉంటుంది.


ఇక ఐదు లక్షల వరకు జనాభా ఉన్నచోట ఒక్కో వైన్స్ కు.. 85 లక్షలు వరకు చెల్లించాలి.  అంటే ఓవరాల్ గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో గోవాగా మార్చుతున్నారని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఇక మద్యం తక్కువకు అందించినా.. మందుబాబులు.. తాగడమే పనిగా పెట్టుకుంటారని కూడా కొందరు అంటున్నారు. దానికి తమ భార్యల పుస్తెలు తెంపి మరీ.. తాగుతారని విమర్శలు వస్తున్నాయి. ఏదీ ఏమైనా.. తక్కువ ధరకు మద్యం అందించడం కూడా చాలా డేంజర్‌ అని అంటున్నారు. మరి దీనిపై చంద్రబాబు సర్కార్‌ ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: