ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం విధానం త్వరలో అమలులోకి రానుండగా లైసెన్స్ దారులు రిటైల్ వ్యాపారం చేస్తే ఏకంగా 20 శాతం మేర మార్జిన్ ఉంటుందని తెలుస్తోంది. నగర పాలక సంస్థలు మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాలను మోడల్ స్టోర్స్ గా అప్ గ్రేడ్ చేయడం కోసం కొత్త విధానంలో అవకాశం కల్పించడం జరిగింది. ఇందుకోసం ఏడాదికి 5 లక్షల రూపాయల చొప్పున అదనంగా లైసెన్స్ రుసుమును చెల్లించాలి.
 
ఏపీ ప్రభుత్వం ఏకంగా 3396 మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వగా వీటికి అదనంగా 12 ప్రీమియం స్టోర్లను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో వీటి ఏర్పాటు దిశగా అడుగులు పడనున్నాయని తెలుస్తోంది. ఈ స్టోర్లకు ఏకంగా ఐదేళ్ల కాలపరిమితి ఉంటుందని భోగట్టా. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కడప, అనంతపూర్ లలో వీటిని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.
 
ఈ స్టోర్లకు లైసెన్స్ రుసుము ఏడాదికి ఏకంగా కోటి రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. మరోవైపు రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గడం గమనార్హం. 99 రూపాయలకే క్వార్టర్ మద్యం లభించే విధంగా ఎమ్మార్పీలను నిర్ణయించడం జరిగింది. వైసీపీ హయాంలో మద్యంపై 10 రకాల పన్నులు విధించగా ప్రస్తుతం వాటిని 6కు కుదించడం గమనార్హం. ఏపీ సర్కార్ కొత్తగా మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకంను విధిస్తోంది.
 
ల్యాండెడ్ కాస్ట్ పై 2 శాతం మేర ఈ పన్ను ఉంటుందని సమాచారం అందుతోంది. ఏపీలో మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్ కు అప్పగించడానికి ప్రభుత్వం చట్టానికి కొన్ని సవరణలు చేయడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో గీత కార్మికుల కోసం ప్రత్యేక విధానం అమలు కానుండటం గమనార్హం. ఈ విభాగంలోకి వచ్చే 6 కులాలకు 340 దుకాణాలను కేటాయించనున్నారు. తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతులు లేవని తెలుస్తోంది.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: