* మద్యంతోనే రాష్ట్ర ఖజానా కళకళ..నిషేదిస్తే విల విల..!

* మేనిఫెస్టోల్లో అమలుకాని హామీల్లో ఒకటిగా మద్యపాన నిషేధం.!

* ఇప్పటికి...ఎప్పటికి...మద్యం ప్రియులకు పండగే..!

(ఏపీ-ఇండియాహెరాల్డ్): మద్యపానం అలవాటుగా మొదలయి చివరికి వ్యసనంగా మారుతుంది.తాగుడుకు అలవాటై, వ్యసనంగా మారి దానికి బానిసైపోయిన వ్యక్తి పతనం అనేది చాలా దశల్లో జరుగుతుంది.అయితే మద్యపానం నిషేధం చరిత్ర చూస్తే భారతదేశంలో నిగ్రహ ఉద్యమం తరచుగా మణిపూర్ మాదిరిగానే వివిధ రాష్ట్రాల్లో మద్యపాన నిషేధానికి దారితీసింది.బ్రిటిష్ ఇండియాలో  చాలా మంది భారతీయ నిగ్రహ కార్యకర్తలు దేశంలో నిషేధం కోసం ఆందోళన చేశారు.1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో మద్యం నిషేధమని చేర్చబడింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్. టి .రామారావు ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మద్యపాన నిషేధం అనేది చూపించారు అయితే అలాంటి నాయకుడి తర్వాత మరే నాయకుడు కూడా అలాంటి సాహసం చేయలేకపోయారు.అయితే 2019 ఎన్నికల ముందు జగన్ మోహనరెడ్డి మానిఫెస్టోలో భాగంగా దశల వారీగా మద్యం నిషేధం చేస్తానని చెప్పి దాన్ని ఆచరణలోకి తీసుకురాలేక పోవడంలో ఫెయిల్ అయ్యారు.దేశంలో ఎక్కడా దొరకని బ్రాండ్లను ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నాయకులే తయారు చేస్తూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.మద్యంపై వచ్చే ఆదాయన్ని క్రమంగా తగ్గిస్తూ, మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధిక ఖజానా కోసం భారీగా నాసిరకం మద్యాన్ని తెచ్చి మందు ప్రియులకు మోసం చేసింది.

అయితే 2024 ఎన్నికల ముందు నాయకులు ఇచ్చిన హామీల్లో భాగంగా మద్యాన్ని పూర్తిగా నిర్ములించలేమని కాకపోతే గత ప్రభుత్వం మాదిరిగా నాసిరకం మద్యాన్ని తీసుకువచ్చి ప్రజల ఆరోగ్యాలతో చాలగటం ఆడకూడని కూటమి ప్రభుత్వం మద్యంలో కొత్త పాలసీ తీసుకువస్తుంది. దానికి సంబంధించి కొత్తగా విధివిధానాలు జారీ చేసిన సంగతి తెల్సిందే. ఏదేమైనా యే ప్రభుత్వమైనా మద్యాన్ని నిషేదించడం అనేది కేవలం ఎన్నికల హామీల్లో భాగమేనని దాన్ని పూర్తిగా నిషేదించడం కుదరదని తేలిపోయింది అలా చేస్తే రాష్ట్ర ఆదాయం పూర్తిగా దెబ్బతినతుందని నాయకులు చెప్పకనే చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: