మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.. ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఏకంగా భారతీయులకు స్వేచ్ఛాయువులు అందించిన ఓ గొప్ప నినాదం. మానవాళికి మానవత్వం నేర్పించిన ఒక విప్లవం. శాంతి కవచాన్ని తన ఆయుధంగా మార్చుకుని.. ఆంగ్లేయుల తుపాకులకు ఎదురొడ్డి పోరాడిన ఒక ఉద్యమం. ఏకంగా భారతీయుల బానిస సంకెళ్లు తెంచిన మహోన్నత వ్యక్తి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ

 ఎన్ని దశాబ్దాలు శతాబ్దాలు గడిచిన భారతీయుల గుండెల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్న  గాంధీ గురించి కొత్తగా చెబితే అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం భారతీయులు స్వేచ్ఛ ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో బ్రతకగలుగుతున్నారు అంటే దానికి ఆ మహాత్ముడి త్యాగమే కారణం అని చెప్పాలి. ఇక నేడు గాంధీ జయంతి కావడంతో మహాత్ముడు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ అందరూ  గాంధీ జయంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా మహాత్మా గాంధీ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వైరల్ గా మారిపోతున్నాయి.



 అయితే ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని మహాత్మా గాంధీ బాగా నమ్మేవారు.  కావాల్సిన వాళ్ళకి కూడా ఇదే సూచించేవారు. అయితే ఇలా ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ నినదించిన గాంధీజీ అప్పట్లో రోజువారి ఆహారంలో ఎలాంటి పోషకాలు ఉండేలా చూసుకునేవారు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే గాంధీ తన ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకునేవారు. ప్రోటీన్లు విటమిన్లు అధికంగా ఉండే దంపుడు బియ్యాన్ని మాత్రమే తినేవారట. అంతేకాకుండా సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలను మాత్రమే ఇష్టపడే వారట. చెక్కరను పక్కనపెట్టి ప్రతిరోజు బెల్లం టీ తాగేవారట. అంతేకాదు రోజు 15 కిలోమీటర్ల నడవడంతో పాటు ప్రాణాయామం చేసేవారట. ఇక ధూమపానం మద్యపానం మాంసాహారానికి గాంధీ ఎప్పుడూ దూరంగానే ఉండేవారట. ఇలా ఆయన తన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకొనేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: