* తెలంగాణలో మద్యం తాగే మహిళలు ఎక్కువ అవుతున్నారా

* మగవారికి పోటీ వస్తున్నారా  

* వీరి సంఖ్య పెరగడం వల్ల బ్యాన్ విధించడం ఎందుకు కష్టమవుతుంది

(తెలంగాణ - ఇండియా హెరాల్డ్)

వెస్ట్రన్ కంట్రీస్‌లోనే కాదు భారతదేశంలో కూడా మందు తాగే ఆడవారు ఎక్కువే ఉన్నారు. మందుబాబుల వలె వీరి సంఖ్య ఎక్కువగా లేదు కానీ గతంలో కంటే ముందు అలవాటు పడుతున్న మహిళల సంఖ్య పెరుగుతున్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. మద్యం తాగే మహిళలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ముందు వరుసలో ఉంటుంది. తెలంగాణలో 15-49 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 4.9% మంది మహిళలు మద్యం తాగుతున్నట్లు ఒక రీసెంట్ సర్వేలో తేలింది. అంటే, ప్రతి 20 మంది మహిళల్లో ఒకరు మద్యం తాగుతున్నారు అని అర్థం.

మన దేశంలో మద్యం తాగడం గురించి ఓపెన్ గా ఎవరూ మాట్లాడరు. మగవాళ్ళలో చాలామంది స్నేహితులు తెలిసిన వాళ్ళతో మాట్లాడుకుంటారు కానీ కొత్త వాళ్ల ముందు లేదంటే మిగతా చోట్ల మద్యం తాగుతాం అని ఎవరూ చెప్పుకోరు తాగుతావా అంటే నాకు అలవాటు లేదు అని చెప్తారు. ఇక మహిళలు మద్యం తాగుతున్న ఆ విషయాన్ని అసలు ఒప్పుకోరు. మహిళల అయ్యుండి ఆల్కహాల్ తాగడం చాలా పెద్ద తప్పు అని, సమాజం ఒప్పుకోదని, అందరూ తమను తప్పు చేసినట్లుగా పాపం చేసినట్టుగా చూస్తారని మహిళలు భయపడతారు.

 సాధారణంగా సర్వేలు చేసేటప్పుడు చాలా మంది తమ అసలు అలవాట్లను చెప్పకుండా, ఇతరులకు నచ్చేలా సమాధానాలు చెబుతారు. దీనినే సోషల్ డిజైరబిలిటీ బయాస్ అంటారు. 2010లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ మహిళల్లో 59% మంది కల్లు తాగుతున్నారు. అంతేకాకుండా, 40.8% మంది బీర్, విస్కీ కూడా తాగుతున్నారు. పురుషులెం తక్కువ కాదు కానీ ఆడవాళ్లు తాగుడే విడ్డూరంగా అనిపిస్తుంది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఇంత ఎక్కువ సంఖ్యలో మహిళలు మద్యం తాగరు.

మరి మద్యపాన నిషేధం ఎలా సాధ్యం?

మహిళలు కూడా మద్యం తాగడం మొదలు పెట్టడంతో మద్య నిషేధం చేయడం కష్టమైపోతుంది. మద్యం అమ్మకం మీద ప్రభుత్వానికి చాలా ఆదాయం వస్తుంది. మద్యంపై నిషేధం విధిస్తే ఈ ఆదాయం తగ్గిపోతుంది. దీంతో ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోతుంది. మహిళలు కూడా మద్యం తాగడం కామన్ అయిపోయింది కాబట్టి మద్యం బ్యాన్ చేస్తే చేస్తే చాలా మంది ప్రజలు వ్యతిరేకిస్తారు. అంతేకాదు, బ్లాక్ మార్కెట్‌లో లిక్కర్ అమ్మకాలు పెరుగుతాయి. దీన్ని నియంత్రించడం చాలా కష్టం. మహిళలు కూడా పురుషులలాగే తమకు ఇష్టం వచ్చినట్లు లిక్కర్ తాగాలని అనుకుంటూ ఉండవచ్చు. అందుకే మద్యంపై నిషేధం విధిస్తే తమ స్వేచ్ఛకు భంగం కలుగుతుందని భావించవచ్చు ఈ నిషేధం విధించిన నేతలకు ఓట్లు వేయకుండా వారి పతనానికి దారి తీయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: